టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. లై, పడిపడి లేచే మనసు ప్లాప్స్ తర్వాత 'సీతారామం' అనే కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ భామ మృణాళి ఠాకూర్ లను హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అలాగే విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, ఓపెనింగ్ కలెక్షన్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. అందమైన ప్రేమ కథగా, మిలిటరీ నేపథ్యంగా దేశభక్తిని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెన్సింగ్ రాబట్టింది. థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదనే మాట అబద్ధమని నిరూపిస్తూ.. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని మరోసారి రుజువు చేసింది సీతారామం. మొత్తంగా 316 ప్రీమియర్ షోలతో 47 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాదాపు 26 శాతం అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యాయి. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ 90K డాలర్లు, ఫస్ట్ డే 100k వసూళ్లను సాధించడం విశేషం. ఇక సీతారామం మూవీ ఫస్ట్ డే ఏరియా వైస్ కలెక్షన్స్ చూసినట్లయితే.. నైజాం: 54 లక్షలు సీడెడ్: 16 లక్షలు ఉత్తరాంధ్రా: 23 లక్షలు ఈస్ట్ గోదావరి: 15 లక్షలు వెస్ట్ గోదావరి: 8 లక్షలు గుంటూరు: 16 లక్షలు కృష్ణ: 13 లక్షలు నెల్లూరు: 5 లక్షలు ఏపీ-తెలంగాణ కలిపి 1.50 కోట్లు షేర్ (2.25 కోట్లు గ్రాస్) కర్ణాటక,రెస్ట్ ఆఫ్ ఇండియా: 15 లక్షలు ఇతర భాషలలో: 35 లక్షలు ఓవర్సీస్: 1.05 కోట్లు వరల్డ్ వైడ్: 3.05 కోట్లు షేర్ ( 5.60 కోట్లు గ్రాస్) సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలి రోజున 5 కోట్లకుపైగా గ్రాస్, 3 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది. రెస్పాన్స్ ఇంతే పాజిటివ్ గా ఉంటే.. కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 16.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెండు రాష్ట్రాల్లో కూడా సీతా రామం సినిమా 14 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో సీతారామం రూ. 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమాకు ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్ కొనసాగితే తొలి వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే.. ఇటీవల కాలంలో క్లీన్ హిట్ సొంతం చేసుకొన్న ప్యూర్ లవ్ స్టోరీగా సీతారామం రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది. మరి సీతారామం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. #SitaRamam Box office Collection AP-TG Total:- 1.50 Cr Share (2.25 Cr Gross) Ka+ROI – 15L Other Languages – 35L OS – 1.05Cr Total World Wide – 3.05 Cr Share ( 5.60 Cr Gross) Break Even= 17.00Cr Movie Need Another 13.95Cr For Break Even#DulquerSalmaan — Sushil sinha (@SushilSinha_108) August 6, 2022