నాగార్జున అక్కినేని, నాగచైతన్యలు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ఏడాది నాగ చైతన్యకు మంచి విజయం దక్కింది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నా ధైర్యం చేసి రిలీజ్ చేసిన బంగార్రాజు సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతూ సరసన కృతి శెట్టి నటించింది.
ఇది చదవండి: వైజాగ్ లో తాజ్ మహల్.. దాని వెనక ఉన్న ప్రేమ కథ తెలుసా..!
బంగార్రాజు చిత్రం బృందం ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వీడియో తాజాగా బయటకి వచ్చింది. ఈ వీడియోలో నాగార్జునతో పాటు.., చిత్ర బృందం అంతా సరదాగా గడుపుతూ ఉండగా.. చైతూ, కృతి శెట్టి మాత్రం ఫ్లైట్ చివరి సీట్ లో కూర్చొని మాటల్లో పడిపోయారు. వీరిద్దరూ తమ చుట్టూ ఉన్న మనుషులను మర్చిపోయి మాట్లాడుకుంటూ ఉండగా.. కెమెరా వారి వైపు రావడంతో ఇద్దరు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే.., చూడటానికి మాత్రం ఈ వీడియో క్యూట్ గా అనిపిస్తోంది. దీంతో.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక నెటిజన్స్ కూడా ఈ వీడియోపై సరదా కామెంట్స్ చేస్తున్నారు.