ప్రముఖ టీవీ షో నిర్మాతపై స్టార్ నటి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను తీవ్రంగా వేధించాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
సినీ తారలపై ప్రేక్షకులు, అభిమానుల్లో ఉండే అభిప్రాయాలు వేరు. మూవీ స్టార్స్ రంగుల ప్రపంచంలో జీవిస్తుంటారని, సకల సదుపాయాల మధ్య సంతోషంగా ఉంటారని అనుకుంటారు. రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని భావిస్తుంటారు. అయితే ఇది కొంతమంది విషయంలో నిజమే కావొచ్చు. కానీ చాలా మంది నటుల జీవితాల్లో ఎన్నో ఒడిదొడుకులు, సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా నటీమణుల విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే చిత్ర పరిశ్రమను ఒక టైమ్లో ‘మీ టూ’ ఉద్యమం ఊపేసింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ ఉద్యమం ఆగిపోయింది. కాగా, తాజాగా ఒక స్టార్ నటి తనను ఓ నిర్మాత వేధించాడన్నారు. ఫేమస్ హిందీ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ నిర్మాత తనను టార్చర్ చేశాడని మోనికా భడోరియా ఇటీవల తెలిపారు.
‘తారక్ మెహతా’ షో నిర్మాత వేధింపులు తట్టుకోలేక ఒక టైమ్లో తాను సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యానని ఒక ఇంటర్వ్యూలో మోనికా భడోరియా చెప్పారు. ఆ షో కోసం తనతో వెట్టిచాకిరీ చేయించుకొని ఆఖరుకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఎగ్గొట్టారని ఆమె ఆరోపించారు. ఆ షో షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్న మోనికా.. అది నరకంతో సమానం అని చెప్పుకొచ్చారు. తన తల్లి క్యాన్సర్‌తో ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో షో యూనిట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదని పేర్కొన్నారు. పైగా తాను తల్లితో ఆస్పత్రిలో ఉంటే.. వాళ్లు కావాలనే షూటింగ్ చేసేవారని, రమ్మని బలవంతం చేసేవారని మోనికా భడోరియా వివరించారు. తనను టార్చర్ పెడుతూనే, తల్లి వైద్యానికి ఆర్థిక సాయం చేశామని వాళ్లు ప్రచారం చేసుకున్నారని.. ఇది తనను బాధించిందని మోనిక వ్యాఖ్యానించారు. కాగా, ‘తారక్ మెహతా’ షో నిర్మాతపై మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ బన్సీలాల్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Exclusive: Taarak Mehta’s Monika Bhadoriya felt suicidal due to the mental torture on set#MonikaBhadoriya #TaarakMehtaKaOoltahChashmah #TMKOChttps://t.co/THLd748chk
— ETimes TV (@ETimesTV) June 6, 2023