కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఆయన ప్రస్థానం భావితరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. తెలుగునాట చెప్పుకోదగ్గ లెజెండరీ యాక్టర్ లలో మోహన్ బాబుకి చిరకాల స్థానం ఉంటుంది. అయితే.. ఈ మధ్యకాలంలో మోహన్ బాబుపై, ఆయన కుటుంబ సభ్యులుపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక “సన్ ఆఫ్ ఇండియా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఈ విషయంలో కాస్త సీరియస్ గా స్పందించారు.
”ట్రోల్స్, మీమ్స్ అనేవి ఎప్పుడూ సరదాగా నవ్వుకునేలా ఉండాలి. అంతేతప్ప ఎదుటివారిని టార్గెట్ చేసి, ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని పైకి వచ్చాను. కాబట్టి.. నేను ఇలాంటి ట్రోలింగ్స్, మీమ్స్ పట్టించుకోను. నా సన్నిహితులు కూడా అప్పుడప్పుడు నాకు వాటిని పంపిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో మీమ్స్, ట్రోల్స్ హద్దులు మీరుతున్నాయి. అవి చూసినప్పుడల్లా బాధ కలుగుతుంది.ఎదుటి వారిని కించపరుస్తూ వ్యగ్యంగా ట్రోల్ చేయడం ఎంత వరకు కరెక్ట్? నా మీద ఇన్ని మీమ్స్, ట్రోల్స్ రావడానికి ఇద్దరు హీరోలు కారణం. నన్ను ట్రోల్ చేయడానికి యాబై నుంచి వంద మంది ఎడిటర్లను నియమించుకున్నారని తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు. ఎవరూ సహాయపడరు’’ అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఆ ఇద్దరు హీరోలు ఎవ్వరు అనే విషయాన్ని మాత్రం మోహన్ బాబు వెల్లడించలేదు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.