కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక గొప్ప నటుడిగా, విద్యాసంస్థల అధినేతగానే అందరికీ తెలుసు. అయితే ఆయన జీవితం మొత్తం పూలబాట అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఆయన జీవితంలో అనుభవించిన కష్టాలు, చూసిన ఎత్తుపల్లాల గురించి స్వయంగా ఆయనే అందరితో పంచుకున్నారు. శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సం, మోహన్ బాబు జన్మదినం సందర్భంగా శనివారం వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ మోహన్ బాబు జీవితంలో అనుభవించిన ఒడిదొడుకుల గురించి ప్రస్తావించారు.
ఇదీ చదవండి: సినీ కార్మికులకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బంపర్ ఆఫర్
‘ఏదో సాధించాలనే పట్టుదలతో చిత్తూరు నుంచి మద్రాసు వెళ్లాను. జీవితం మొత్తం కష్టాలమయం. వేసుకోవడానికి చెప్పుల్లేక, తినడానికి తిండిలేక, కేవలం రెండు జతల బట్టలతోనే ఏడేళ్లు గడిపాను. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసరి నారాయణరావు నన్ను వెండితెరకు పరిచయం చేశారు. తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. నిర్మాతగా ఎదిగాను. జీవితంలో ఎన్నో జయాపజయాలు చవి చూశాను. నా జీవితం ప్రతిరోజూ ముళ్ల బాటలా ఉండేది. నేను అనుభవించిన కష్టాలు ఎదుటివారికి రాకూడదని భావిస్తుంటాను. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే శ్రీ విద్యానికేతన్ స్థాపించాం. ఇక్కడ కులమతాలకు అతీతంగా 25 శాతం మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. నేను ఇతరులకు ఎంతో ఉపయోగిపడినా.. నాకు ఏ ఒక్కరూ ఉపయోగపడలేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు నాతో ప్రచారం చేయించుకున్నారు. వాళ్ల సాయం నాకు ఎప్పటికీ ఉండదు. నేను వాళ్లను సాయం అడగను కూడా. జీవితం నాకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. జీవితంలో ఎన్నోసార్లు మోసపోయాను’ అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.