గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు.
గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలు అంటూ ఇండస్ట్రీలో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మంచు మనోజ్-మంచు విష్ణులు విడిపోతున్నారు అన్న న్యూస్ పరిశ్రమలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత ఆ వీడియో ఓ షో కోసం అని తెలిశాక.. మంచు ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాలిటీ షో టీజర్ ను వదిలాడు మంచు విష్ణు. దాంతో ఓ షో ప్రమోషన్స్ కోసం మరీ ఇంత దిగజారాల అంటూ.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.
అయితే అది నిజమైన షోనా.. లేక వివాదానికి సంబంధించిన విషయాలను కవరింగ్ చేయడం కోసమో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు.
గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అదీకాక కొన్ని రోజుల క్రితం విష్ణు-మనోజ్ ల మధ్య గొడవలు అంటూ అన్ని న్యూస్ ఛానల్స్ వార్తలు రాశాయి. ఇక ఇదే విషయంపై పూర్తి క్లారిటీ కోసం మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించింది మీడియా. తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ దంపతులు కలిసి తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం మోహన్ బాబు, మనోజ్ లు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు కుటుంబంలో రేగిన వివాదంపై స్పష్టత ఇవ్వాలని విలేకర్లు అడిగారు.
ఈ ప్రశ్నపై మోహన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కుటుంబంలో జరిగిన గొడవలను ఇలా బహిరంగంగా అడగం భావ్యం కాదని, మీకూ కుటుంబాలు ఉన్నాయి అంటూ సమాధానం ఇచ్చాడు మోహన్ బాబు. ఏది ఎప్పుడు అడగాలో అప్పుడే అడగాలి అంటూ.. ఫైర్ అయ్యారు. ఇక మనోజ్ ను రీసెంట్ ఇష్యూస్ పై క్లారిటీ ఇవ్వాలని అడగ్గా.. మనోజ్ వెటకారంగా మాట్లాడాడు. “నాకు చిన్న సెగగడ్డ వచ్చింది. వచ్చి గోకుతారా? ఇదే రీసెంట్ ఇష్యూ” అంటూ చంక ఎత్తి చూపిస్తూ.. వ్యంగ్యంగా మాట్లాడాడు. దాంతో మీడియా ప్రతినిధులు మనోజ్ పై ఫైర్ అవుతున్నారు. నెక్ట్స్ వాట్ ద ఫిష్-మనం మనం బరంపురం అనే సినిమాను కెనడాలో త్వరలో షూటింగ్ చేయబోతున్నట్లు తెలిపాడు మనోజ్. మరి మనోజ్ మీడియా ప్రతినిధులపై చేసిన వెటకారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.