స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో నటిగా మారిన అనసూయ.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తోంది. ఇక అనసూయ నటించిన కొత్త సినిమా 'రంగమార్తాండ' రిలీజ్ కి రెడీ అయ్యింది. తాజాగా రంగమార్తాండ ప్రెస్ మీట్ లో స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో నటిగా మారిన అనసూయ.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తోంది. కొంతకాలంగా యాంకరింగ్ కి దూరంగా ఉంటున్న అనసూయ.. చేతినిండా సినిమాలు ఉండటంతో.. సినిమాల్లోనే తాను బిజీ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇక అనసూయ నటించిన కొత్త సినిమా ‘రంగమార్తాండ’ రిలీజ్ కి రెడీ అయ్యింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా రిలీజ్ దగ్గరపడినా మేకర్స్ మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. ఇండస్ట్రీ వారికే స్పెషల్ ప్రీమియర్స్ వేసి.. చిన్నగా వారి రివ్యూస్ ద్వారా ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే.. తాజాగా రంగమార్తాండ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ తో పాటు అనసూయ కూడా పాల్గొని.. స్టేజ్ పై ఎమోషనల్ అయ్యింది. దర్శకుడు కృష్ణవంశీకి థ్యాంక్స్ చెబుతూ.. ఒక్కసారిగా ఏడ్చేసింది. స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది అనసూయ. తాను మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు. నా జీవితానికి రంగమార్తాండ మూవీ చాలు.. అని భావోద్వేగానికి గురైంది.
అనసూయ మాట్లాడుతూ.. ‘నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో. రంగమార్తాండ అనే సినిమాలో నేనున్నాను. నా జీవితానికి ఇది చాలు. నేను నిన్నే సినిమా చూశాను. ఆల్రెడీ నటసామ్రాట్ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను. కానీ.. థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్ గా చూశాను. నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇది. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చింది” అని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అనసూయ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.