మంచు మనోజ్-భూమా మౌనికారెడ్డిల పెళ్లి విషయంలో అలా మాట్లాడే వారిని కుక్కలతో పోల్చాడు మంచు మోహన్ బాబు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుక్కలు అలానే మెురుగుతాయ్ మెురగనివ్వు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలపై వేల కళ్లు ఉంటాయి. దాంతో వారు ఎక్కడికి వెళ్లినా క్షణాల్లో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని అవాస్తవాలు కూడా ప్రజల్లోకి వెళ్తుంటాయి. అయితే వాటిల్లో కొన్ని రూమర్లు ఉంటాయి, మరికొన్ని నిజాలు ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన న్యూస్ ఏదైనా ఉందంటే? అది మంచు మనోజ్-భూమా మౌనికారెడ్డిల పెళ్లి. ఇక ఎట్టకేలకు వీరి పెళ్లి తాజాగా జరిగింది. ఈ క్రమంలోనే మనోజ్ పెళ్లిపై వచ్చిన రూమర్ల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు మోహన్ బాబు. అదీకాక భూమా ఫ్యామిలీ ఎప్పటి నుంచో మాకు తెలుసు అని కలెక్షన్ కింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కొన్ని రోజులు క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయిన న్యూస్ మంచు మనోజ్-భూమా మౌనికాల పెళ్లి న్యూస్. అయితే ఈ పెళ్లికి మోహన్ బాబు ఒప్పుకోలేదని, ఆ పెళ్లికి ఆయన హాజరుకారు అని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను కొట్టిపారేస్తూ.. మనోజ్- మౌనికల పెళ్లికి హాజరై వధూవరులిద్దరిని ఆశీర్వదించారు మోహన్ బాబు. అయితే మనోజ్ రెండో పెళ్లి తనకు ఇష్టం లేదని వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించాడు కలెక్షన్ కింగ్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడారు మోహన్ బాబు. ఆయన మాట్లాడుతూ.. “మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే చెప్పాడు. అయితే నేను ఓ సారి ఆలోచించు అన్నాను. లేదు నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం సరైనదేనని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ చేసుకో అన్నాను అంతే. ఇక ఎవడో ఏదో అనుకుంటాడు అని మనం చేసే పని ఆపకూడదు” అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
ఇక ఈ రూమర్లు క్రియేట్ చేసిన వారి గురించి కాస్త ఘాటుగా స్పందించారు కలెక్షన్ కింగ్. ఏనుగు దారిపై వెళ్తుంటే.. దాని వెనకాల ఎన్నో కుక్కలు మెురుగుతాయి, మనం ఎన్ని కుక్కలను అపుతాం.. ఇక మెురిగే కుక్కలను నువ్వు మెురగనివ్వు అంటూ.. వారిని కుక్కలతో పోల్చారు. ఇక అలాంటి వారిని పట్టించుకోకుండా నువ్వు నీ దారిలో వెళ్తే.. నువ్వు గొప్పోడివి అవుతావు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక భూమా ఫ్యామిలీతో నాకు చక్కని అనుబంధం ఉందని తెలిపారు మోహన్ బాబు. మరి విమర్శలు చేసే వాళ్లను కుక్కలతో పోల్చిన మోహన్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.