సాధారణంగా సినిమా పరిశ్రమంలో ఆ హీరోకి, ఈ హీరోకి పడదు, ఈ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు మనం తరచూ సినిమా ఇండస్ట్రీలో వింటూ ఉంటూనే ఉంటాం. ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ.. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో ఆ హీరోలిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు చెక్ పెడుతుంటారు వారు. అయితే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు వార్తలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. విభేదాలకు ముఖ్య కారణం మంచు మనోజ్ అంటు గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
మంచు మనోజ్.. విలక్షణ నటుడు మోహన్ బాబు నటవారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మంచు మనోజ్ నుంచి ఎలాంటి చిత్రాలు రాలేదు. అయినప్పటికీ మనోజ్ తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణం మనోజ్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలే. కొన్ని రోజుల క్రితం ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికారెడ్డిని మనోజ్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి కారణం మనోజ్-మౌనికారెడ్డిలు ఇద్దరు కలిసి ఓ కార్యక్రమంలో కనిపించడమే.
అయితే ఈ వార్తల దగ్గర నుంచే మంచు ఫ్యామిలీలో విభేదాలు వచ్చినట్లు సమాచారం. మంచు విష్ణు సైతం మనోజ్ తో సరిగ్గా మాట్లాడ్డం లేదని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. అయితే మనోజ్ పెళ్లి గురించి మంచు లక్ష్మిని సైతం అడగ్గా ఆమె ఇచ్చిన సమాధానం కూడా మంచువారి కుటుంబంలో నిజంగానే విభేదాలు ఉన్నాయి అనడానికి బలాన్ని చేకూర్చాయి. అదీకాక గత కొన్ని రోజుల నుంచి మనోజ్ కుటుంబంతో కలిసి ఉండటం లేదని తెలుస్తోంది. ఇన్ని వార్తలు వస్తున్నప్పటికీ మనోజ్ మాత్రం కుటుంబానికి దగ్గరయ్యే పనులే చేస్తున్నాడు. అన్న మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా.. జారుమిఠాయి సింగర్ తో కలిసి బర్త్ డే విషెస్ తెలిపాడు మనోజ్. ట్రోల్స్ వస్తుంటాయి బ్రో.. ఇవన్ని నువ్వు పట్టించుకోవద్దు అంటూ ఆ వీడియో లో చెప్పుకొచ్చాడు మనోజ్.
ఇక తాజాగా విష్ణు ఇద్దరు కూతుళ్ల బర్త్ డే రోజు కూడా మనోజ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశాడు. అయితే ఈ రెండు సందర్బాల్లో విష్ణు.. తమ్ముడికి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని, దాంతో కొందరు అభిమానులు నిజంగానే వీరి మధ్య విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మరికొందరేమో వారు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండోచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి క్లారిటీ రాలేదు. దాంతో నిజంగానే వారి మధ్య విభేదాలు ఉన్నట్లు కొందరు సోషల్ మీడియా వేదికగా వార్తలు రాస్తున్నారు. ఇన్ని వార్తలు వస్తున్నాగానీ మనోజ్ ఎప్పటికప్పుడు తనకు ఫ్యామిలీ పై ఉన్న ప్రేమను తెలుపుతూనే ఉన్నాడు.