కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని- మోహన్ బాబుని వేరు చేసి చూడలేదు. 47 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అటు నటుడిగానే కాకుండా విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ద్వారా 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని పిల్లలకు కూడా ఎంతో మందికి మోహన్ బాబు తమ విద్యా సంస్థల ద్వారా ఉచిత విద్య అందిస్తున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలు ప్రస్తుతం మోహన్ బాబు విశ్వవిద్యాలయంగా మారాయని మోహన్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ సమయంలో చిరంజీవిని నిందించారు : రాజమౌళి
ఇన్నాళ్లలో ఇండస్ట్రీ తనకి ఎంతో ఇచ్చిందని.. ఉడతాభక్తిగా తాను కూడా ఎంతో కొంత చేయాలని ఆలోచన చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికుల పిల్లలు ఎవరైనా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుకోవాలంటే వారికి ఫీజులో రాయితీ ఇస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మోహన్ బాబు చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఆయన నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు తీసుకున్న నిర్మయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.