పుకార్లకు చెక్ పెడుతూ.. పెళ్లి పీటలు ఎక్కారు మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డిలు. శుక్రవారం ఉదయం వీరు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో మౌనిక, మనోజ్‌లకు సంబంధించిన పాత ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం మార్చి 3న శుక్రవారం ఉదయం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. పెళ్లి గురించి రూమర్లు ప్రచారం అవుతోన్న నేపథ్యంలో.. స్వయంగా మంచు మనోజ్.. తన ట్విట్టర్‌లో పెళ్లి గురించి పోస్ట్ చేసి అధికారిక ప్రకటన చేశాడు. మంచు మనోజ్ వెడ్స్ మౌనిక.. పెళ్లి కుమార్తె అంటూ భూమా మౌనికా రెడ్డి ఫొటో ట్వీట్ చేశాడు. వీరిద్దరి పెళ్లి అయినట్లు కన్ఫాం కావడంతో.. నూతన దంపతులకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మనోజ్-మౌనికలు ఇద్దరికి ఇది రెండో వివాహమే. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం.
ఇక మనోజ్-మౌనికల పెళ్లి నేపథ్యంలో.. వీరిద్దరికి సంబంధించిన పాత ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. గతంలో మౌనిక ఫస్ట్ మ్యారేజ్‌కి మనోజ్.. గెస్ట్‌గా వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. మంచు, భూమాల కుటుంబాల మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో.. మౌనిక మొదటి వివాహాకి మనోజ్ అటెండ్ అయ్యాడు. అయితే మౌనికకు కూడా 2015లోనే వివాహం అయ్యింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్ల తర్వాత ఆమె భర్త నుంచి విడిపోయింది.
ఆ తర్వాత మౌనిక, మనోజ్‌ల మధ్య లవ్ స్టార్ట్ అయ్యింది. ఇక నేడు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సందర్భంగా ప్రస్తుతం ఈ పాత ఫొటో వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు గెస్ట్‌గా వెళ్లాడు.. ఇప్పుడు ఏకంగా ఆమెనే వివాహం చేసుకున్నాడు.. డెస్టినీ అంటే ఇదే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మనోజ్ వాట్ ద షిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.