మంచు మనోజ్ ప్రేమ, పెళ్లిపై వచ్చిన పుకార్లకు శుభం కార్డు పడింది. అందరూ ఊహించనట్లే.. మార్చి 3న ఆయన మౌనికను వివాహం చేసుకున్నాడు. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే వీరి ప్రేమ.. పెళ్లి పీటల వరకు చేరడానికి ఓ వ్యక్తి తీవ్రంగా కష్టపడ్డారట. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే..
మంచు మనోజ్-మౌనికా రెడ్డిల వివాహం అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో.. అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల నుంచి అంత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. మంచు మోహన్ బాబు దంపతులు వివాహానికి హాజరయ్యి నూతన దంపతులును ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంచు లక్ష్మి నివాసంలో.. మనోజ్, మౌనికా రెడ్డిల వివాహం జరిగింది. మంచు లక్ష్మి.. స్వయంగా దగ్గరుండి.. పెళ్లి పనులు చూసుకుంది. అన్ని తానై వ్యవహరించి.. తమ్ముడికి అండగా నిలిచింది. పెళ్లి సందర్భంగా అక్క తన కోసం కష్ట పడుతోన్న తీరుపై మనోజ్ స్పందిస్తూ.. ఏ జన్మ పుణ్యమో.. నీలాంటి అక్క లభించింది అంటూ సోషల్ మీడియా వేదికగా అక్కపై తన ప్రేమను, కృతజ్ఞతను చాటుకున్నాడు.
ఇక మంచు లక్ష్మి నివాసంలో వివాహం జరగడంపై కూడా అనేక మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా.. మౌనికతో పెళ్లి, ప్రేమ విషయంలో మంచు లక్ష్మి.. మనోజ్‌కి అండగా నిలిచింది. వారి ప్రేమ గురించి తెలిసిన నాటి నుంచి.. మంచు లక్ష్మి తమ్ముడికి అండగా ఉండటమే కాక.. వారి ప్రేమను పెళ్లి పీటల వరకు చేర్చడంలో ఆమెదే కీలక పాత్ర అని తెలుస్తోంది. మనోజ్-మౌనికల ప్రేమ గురించి ఇరు కుటుంబాలతో చర్చించి.. వారిని ఒప్పించి.. పెళ్లి పీటల వరకు తీసుకు వచ్చింది మంచు లక్ష్మి. ఇక ఈ అక్కా తమ్ముళ్ల మద్య ఎం మంచి రిలేషన్ ఉందో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
విష్ణుతో కన్నా.. తాను మనోజ్‌తో చాలా క్లోజ్ అని.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది లక్ష్మి. ఇక మనోజ్-మౌనికలు ప్రేమలో ఉన్నారని తెలిసిన తర్వాత.. వారి పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. అది వారి వ్యక్తిగత విషయం.. మీకేందుకు అంటూ తమ్ముడికి మద్దతుగా నిలిచింది మంచు లక్ష్మి. మొదటి భార్యతో విడాకుల తర్వాత మంచు మనోజ్ వ్యక్తిగత జీవితంలోను, ఇటు కెరీర్‌లోనూ చాలా సైలెంట్ అయ్యాడు. ఈ క్రమంలో అక్కగా తమ్ముడి పట్ల తన బాధ్యతను భుజాలకెత్తుకుని.. ఓ కొత్త జీవితం ప్రారంభించేందుకు మంచు లక్ష్మి అన్ని విధాల తమ్ముడికి సహకరించింది. అన్ని అడ్డంకులను దాటుకుని.. తమ్ముడిని మళ్లీ ఓ ఇంటి వాడిని చేసి.. మనోజ్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది మంచు లక్ష్మి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.