తెలుగు పాపులర్ నటి మంచు లక్ష్మి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అయితే.. ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా నెట్టింట హల్ చల్ చేస్తోంది లక్ష్మి.
ఇటీవలే తిరుపతిలో ఉన్న హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసిన మంచు లక్ష్మి.. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కేజీఎఫ్-2 మూవీలోని పాపులర్.. వయిలెన్స్ డైలాగ్ ని తనదైన స్టైల్ లో రీల్ చేసింది. మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.