కేజీఎఫ్ ఛాప్టర్ 2కి వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్ష కురిపిస్తోంది. కేవలం 9 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. 37 కోట్ల లాభం కూడా తెచ్చిపెట్టింది. ఇంక ఎక్కడ చూసినా రాకీ భాయ్ డైలాగులు చెప్పడం, అతని హెయిర్ స్టైల్, మేనరిజంతో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలపై క్రికెటర్స్, ఆటగాళ్లు స్పందించడం ఆ డైలాగ్స్ తో రీల్స్ చేయడం చూస్తున్నాం.
ఇదీ చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?
మొన్నటి వరకు పుష్ప ఫీవర్ కొనసాగింది. ఇప్పుడు కేజీఎఫ్ హవా నడుస్తోంది. ఈ క్రేజ్ ను మాంచస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్ వాడుకుంటోంది. తమ జట్టులోని అత్యుత్తమ ప్లేయర్ల పేర్లను ప్రస్తావిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. కెవిన్, గుండో, ఫోడెన్ లను కలిపి.. మా ఓన్ కేజీఎఫ్ అంటూ పోస్టర్ తయారు చేశారు. కేజీఎఫ్ ఫీవర్ మాంచెస్టర్ ఫుట్ బాల్ కు తాకడాన్ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంక కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే.. మొత్తం 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 775.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్ 3 గురించి కూడా ఇప్పటి నుంచే కథ ఎలా ఉంటుంది? అసలు తీస్తారా లేదా అని ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలు పెట్టేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.