శాఫ్ 2023 లో భాగంగా ఫుట్ బాల్ మ్యాచులు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్, భారత్ రెండు ఒకే గ్రూప్ లో ఉండగా ఈ రెండు దేశాల మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో భారత్ 4-0 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే తొలి మ్యాచులోనే పాక్ చిత్తుంగా ఓడిపోవడంతో పాటు మధ్యలో గొడవకి దిగడం ఇప్పుడు వైరల్ గా మారింది.
భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. గేమ్ ఏదైనా ఈ రెండు జట్లు మైదానంలోకి దిగితే ఆ కిక్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. దేశంలో క్రికెట్ కి ఎక్కువగా క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఫుట్ బాల్ మీద మన ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. ఎప్పుడైతే భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దయ్యాయో ఇక అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూసే అవకాశం మన వాళ్ళకి కలగలేదు. ఎప్పుడో ఐసీసీ టోర్నీల్లో ఆడుతూ కాస్త వినోదాన్ని పంచినా పూర్తి స్థాయి సీరిస్ ఆడక దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పుడు ఆ లోటుని తీర్చడానికి ఫుట్ బాల్ రెడీ అయిపోయింది. అయితే తొలి మ్యాచులోనే పాక్ చిత్తుంగా ఓడిపోవడంతో పాటు మధ్యలో గొడవకి దిగడం ఇప్పుడు వైరల్ గా మారింది.
శాఫ్ 2023 లో భాగంగా ఫుట్ బాల్ మ్యాచులు స్టార్ట్ అయ్యాయి. ఈ టోర్నీ ఆసియా దేశాలు మధ్య నిర్వహిస్తారు. ప్రస్తుతం రెండు గ్రూప్ లుగా.. గ్రూప్ కి 4 దేశాల చొప్పున మొత్తం 8 దేశాలు ఏ టోర్నీ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్, భారత్ రెండు ఒకే గ్రూప్ లో ఉండగా ఈ రెండు దేశాల మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అయితే తొలి మ్యాచులోనే పాకిస్థాన్ ని చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. సునీల్ ఛైత్రి దెబ్బకు కుదేలయింది. ఫుల్ టైములో 4-0 తేడాతో పాకిస్థాన్ మీద నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్ తో టీమిండియాకి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. పాక్‌కు గోల్ చేయడానికి అవకాశమే ఇవ్వకుండా భారత్ సమర్థవంతంగా డిఫెండ్ చేసుకుంది. ఇక ఈ మ్యాచులో మరి కాసేపట్లో ముగుస్తుంది అనుకున్న తరుణంలో ఇరు జట్ల మధ్య పెద్ద గొడవే చోటు చేసుకుంది.
ఒక దశలో ఏ రెండు జట్ల మధ్య గొడవ తార స్థాయికి వెళ్ళింది. ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లారు. పాక్ ఆటగాడు బంతిని విసరబోతుండగా భారత కోచ్ ఇగార్ స్టిమాక్ వెనుకనుంచి తన చేత్తో బంతిని నెట్టేశాడు. దీంతో పాక్ ఆటగాళ్లు కోచ్ పైకి దూసుకొచ్చి గొడవకి దిగారు. ఇక భారత ఆటగాళ్లు కూడా అక్కడికి చేరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసేసుకుని వాదులాడుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రిఫరీలు ఇండియా కోచ్ కు రెడ్ కార్డ్ చూపించారు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. మైదానంలో రెండు జట్ల మధ్య గొడవలు జరగడం కామన్ అయినప్పటికీ భారత్, పాకిస్థాన్ మధ్య ఇలా గొడవ చోటు చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Fight Between India and Pakistan in football match 🔥🔥🔥🔥
Kuch bhi bolo, apna Igor Stimac hai dabang🤣🤣🤣#IndianFootball #PakistanFootball #INDvsPAK #SAFFChampionship pic.twitter.com/mRZ655iLVc— ^•^ (@silly_fs) June 21, 2023