తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, నిజాయితీ కూడా ఉండాలి. అప్పుడే వారి గొప్పతనం ఏంటో అనేది బయటపడుతుంది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అంటారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ నుంచి తలకాయలు తీసుకెళ్ళేవాడ్ని” అని చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వకుండా.. కొంచెం మార్పులు చేసి అనుసరించాలి. మన తప్పు ఉంటే తగ్గాలి, తప్పు లేకపోతే తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. దీనికి నిదర్శనమే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. తాను చేసిన తప్పుకి ఒక దర్శకుడికి క్షమాపణలు చెప్పడమే కాకుండా.. తన తప్పును ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘2018’ టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మమ్ముట్టి.. ఈ మూవీ దర్శకుడు జూడ్ ఆంటోనీపై హెయిర్ స్టైల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లు మమ్ముట్టిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దర్శకుడికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ‘జూడ్ ఆంటోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా.. ఎక్స్ ట్రార్డినరీ మైండ్ కలిగిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్’ అంటూ ప్రశంసించారు. అయితే ఇదే మమ్ముట్టిని వివాదంలోకి లాగింది. డైరెక్టర్ ని పొగడాలంటే.. బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం మమ్ముట్టి దృష్టికి వెళ్లడంతో.. ఈ వివాదంపై స్పందించారు.
‘2018 సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా డైరెక్టర్ జూడ్ ఆంటోనీని పొగిడే ఉత్సాహంలో వాడిన పదాలు కొందరిని బాధపెట్టాయి. అందుకు నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను. గుర్తుచేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లే మళ్ళీ ప్రశంసించడం మొదలుపెట్టారు. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అంటూ మెగాస్టార్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే తనను పొగిడే క్రమంలో మెగాస్టార్ తన హెయిర్ గురించి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు సీరియస్ గా తీసుకోవద్దని దర్శకుడు జూడ్ ఆంటోనీ అభ్యర్థించాడు. తన హెయిర్ స్టైల్ తన అభిమాన నటుడైన మమ్ముట్టిని ఇబ్బందుల్లోకి నెట్టడంపై విచారం వ్యక్తం చేశారు.
స్పాట్ లో తన హెయిర్ మీద మమ్ముట్టి కామెంట్స్ చేస్తే.. ఆయనే ఏమీ అనలేదు. కానీ బాడీ షేమింగ్ అని అంత పెద్ద నటుడ్ని ఇబ్బంది పెట్టారు. చివరికి క్షమాపణ చెప్పించారు. క్షమాపణ చెప్పినంత మాత్రాన తగ్గిపోరు కానీ చిన్న చిన్న విషయాలకి కూడా ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని ఒక వర్గం వ్యక్తం చేస్తుంది. మరి మెగాస్టార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లపై, అలానే నెటిజన్ల అభిప్రాయాన్ని గౌరవించి క్షమాపణ, కృతజ్ఞతలు తెలియజేసిన మమ్ముట్టిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.