’26/11 ముంబై’ దాడుల్లో ప్రాణాలు విడిచి చరిత్రలో నిలిచిన ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం.
యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథను కళ్ళకు కట్టినట్లుగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మేకర్స్.. టైటిల్ రోల్ లో అడవి శేష్ నటించడం కాదు.. జీవించాడనే చెప్పాలి. ట్రైలర్ లో మేజర్ సందీప్ ఫ్యామిలీ ఎమోషన్స్, అంబిషన్స్, లవ్.. సాక్రిఫైస్ ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. మొత్తానికి మేజర్ ట్రైలర్ ఎమోషనల్ ఇంటెన్సిటీ డ్రామాగా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ లో చూసినట్లయితే పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ని కూడా అంతే చక్కగా హ్యాండిల్ చేశారు మేకర్స్. చూస్తుంటే సినిమా అంతా కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగినట్లు అనిపిస్తుంది. మేజర్ ట్రైలర్ సినిమాపై సినిమాపై అంచనాలు మరింత పెంచిందని చెప్పాలి. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ త్రిభాషా చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్ మరియు A+S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి మేజర్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.