తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ల్లో ఒకరైన శర్వానంద్.. రక్షితా రెడ్డి మెడలో ఈ నెల 3న మూడు ముళ్లు వేశాడు. అలాగే ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు కూడా ఒక్కటి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నెల 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. వీరితో పాటు మరో జంట..
టాలీవుడ్లో వరుసగా భాజా భంజత్రీలు మోగుతున్నాయి. ఇప్పటికే తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ల్లో ఒకరైన శర్వానంద్.. రక్షితా రెడ్డి మెడలో ఈ నెల 3న మూడు ముళ్లు వేశాడు. అలాగే ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు కూడా ఒక్కటి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నెల 9న వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మెగా కుటుంబం కానీ లావణ్య నుండి కానీ ఎటువంటి స్పందన రాలేదు. అలాగే ఇప్పుడు మరో జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ మరో వార్త హల్ చల్ చేస్తుంది.
అడవి శేష్.. మోస్ట్ హ్యాండ్సమ్, ఎలిజబుల్ బ్యాచ్‌లర్. వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ అందగాడు కూడా సింగిల్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. అక్కినేని నాగార్జున మేనకోడలు, నటి సుప్రియతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడని తెలుస్తుంది. జూన్ 16న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నారని తెలుస్తోంది. అయితే అడవి శేష్ నుండి.. అక్కినేని ఫ్యామిలీ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. చూడాలి వరుణ్ తేజ్-లావణ్యల బంధమా, అడవి శేష్-సుప్రియ ప్రేమ వ్యవహారమా.. ఏదీ పెళ్లి పీటలెక్కుతుందో, ఏదీ వాస్తమో, ఏదీ అవాస్తమమో వేచి చూడాలి.
అక్కినేని మేనకోడలు సుప్రియ.. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించింది. హీరోయిన్గా ఆమెకు అవకాశాలు రాలేదో లేక సినిమాలు వద్దనుకుందో తెలియదు కానీ.. సినిమాలకు పరోక్షంగా దూరమయ్యింది. ఇష్టం హీరో చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడే సుమంత్ డెబ్యూ మూవీ కాళిదాసుకు దర్శకుడు. అయితే మనస్పర్థలు రావడంతో అతడితో విడిపోయింది సుప్రియ. అతడు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. తర్వాత గూఢచారితో మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చింది సుప్రియ. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వినిపించాయి.