టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప సేవాగుణం కలిగిన వ్యక్తి అని అందరికి తెలిసిందే. తరచుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో తనవంతు కృషి చేస్తుంటాడు. ముఖ్యంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పిల్లలకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటాడు. అయితే.. ఇప్పుడు పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు రెయిన్‌బో హాస్పిటల్స్, ఆంధ్రా హాస్పిటల్స్ తో చేతులు కలిపాడు.
తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్.. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల కార్డియాక్ కేర్ కోసం ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్(PLHF)’ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో.. ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్న పిల్లలకు PLHFలో చికిత్స అందించబడుతుంది. పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న, గుండెకు సంబంధించి అనారోగ్యంతో మరణిస్తున్న పిల్లల సంఖ్య ప్రతి ఏడాది గణినీయంగా పెరుగుతుందని సమాచారం తెలుసుకున్న మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ను ప్రారంభించాడు.
Mahesh Babu has launched the the Pure Little Hearts Foundation (PLHF) at Rainbow Children’s Heart Institute (RCHI) for Children’s Cardiac Care. The economically-challenged children with congenital heart diseases would be treated at PLHF through the Mahesh Babu Foundation. pic.twitter.com/Z1wDkF9KIn
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 5, 2022
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, “ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ను ప్రారంభించడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లలు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు. మా ఫౌండేషన్ ద్వారా RCHIలో కార్డియాక్ కేర్ అవసరమైన పిల్లలకు సపోర్ట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. పిల్లల హృదయాలకి గొప్ప సంరక్షణ అవసరమైంది” అని తెలిపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేసేందుకు మహేష్ బాబు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా 1,000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు.
Mahesh Babu Full Speech In Pure Little Hearts Foundation. pic.twitter.com/pCXP8s4QTU
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) March 5, 2022
ఇంతేగాక మహేష్ బాబు ‘హీల్ ఎ చైల్డ్’ ఫౌండేషన్ తో కూడా చేతులు కలిపాడు. ఈ ఫౌండేషన్ పిల్లల వైద్య ఖర్చులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వీటితో పాటు మహేష్ బాబు.. అటు ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆ గ్రామాలలో సామాజిక సేవలు అందిస్తున్నాడు. ఈ గ్రామాల్లో బస్ షెల్టర్లు, మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణం పునరుద్ధరణ, ప్రాథమిక పాఠశాల మౌలిక సదుపాయాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను మహేష్ బాబు ఫౌండేషన్ నిర్వహిస్తుంది. మరి మహేష్ బాబు స్వచ్చంధ సేవలపై, పిల్లల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న కేర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Super Star 💫💫
“Pure Little Hearts Foundation 🤩”
1060 likes need 👇 For this Lovely Pic..
@urstrulyMahesh#SarkaruVaariPaata #Maheshbabuhttps://t.co/WjnBSvBHsP pic.twitter.com/KIlabFExye— Mahesh Babu Abhimani🔔™ (@Callme_Lokendra) March 5, 2022