ఈ మధ్యకాలంలో అభిమాన హీరోలకు సంబంధించి సినిమాల విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అభిమానులు. ప్రతి విషయంలో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఒకలా.. అంచనాలు రీచ్ అవ్వకపోతే మరోలా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రతి విషయాన్నీ క్యాల్కులేట్ చేస్తూ చూస్తున్నారు. సినిమా నుండి ముందు సాంగ్స్ వస్తాయి.. అవి హిట్టయితే సినిమా కూడా ఇరగ్గొట్టేసి ఉంటాడని మ్యూజిక్ డైరెక్టర్ ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ.. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తేడా కొట్టినా వెంటనే అందరినీ ట్రోల్ చేయడం మొదలు పెట్టేస్తారు.
ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ని తెగట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న ‘SSMB28’ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మహేష్ – తమన్ కాంబినేషన్ లో వస్తున్న 5వ సినిమా. అలాగే త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో మూడో సినిమా. సో.. మహేష్ తో సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యేసరికి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా సంతోషించారు. ఓవైపు సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. దీనికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయని తెలుస్తోంది.
ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ట్విట్టర్ లో తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకో ప్రాపర్ రీసన్ తెలియదు గానీ.. ‘RemoveThamanFromSSMB28’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. కాగా.. ఎందుకు తమన్ ని ట్రోల్ చేస్తున్నారు? మహేష్ కి దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు, సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు కదా అనే కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోల్ చేస్తున్నవారు చెబుతున్న రీజన్ ఏంటంటే.. ‘సర్కారు వారి పాట’ సినిమా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్(BGM) విషయంలో తమన్ నిరాశపరిచాడని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లానాయక్.. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి.. రీసెంట్ గా దళపతి విజయ్ వారిసు లాంటి సినిమాలకు బిజిఎమ్స్ అదరగొట్టిన తమన్.. సర్కారు వారి పాట మూవీకి మాత్రం ఆశించిన స్థాయిలో ఇవ్వలేదని.. కళావతి సాంగ్ తప్ప ఇంకేమీ కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. ఆ కారణంగానే తమన్ ని SSMB28 నుండి తీసివేయాలని ట్రోల్స్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ నెగిటివ్ కామెంట్స్ పై కౌంటర్ వేసాడు. తమన్ అలా చేసేసరికి ఫ్యాన్స్ కి ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. పైగా కొన్ని సర్కారు వారి పాటకు సంబంధించి మ్యూజిక్ బిట్స్ ని పోస్ట్ చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో.. ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ ఆల్బమ్ కి నేషనల్ అవార్డు అందుకొని ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ని మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Rest In Peace Dear #Negativity !! To all the kids out there 🤣 pic.twitter.com/pjt7ThMCkn
— thaman S (@MusicThaman) February 4, 2023
#RemoveThamanFromSSMB28 pic.twitter.com/7paKsUoCwU
— HNE 2.0™ (@UrsHNE) February 4, 2023
Sapota Sapota entraa 😬😤💦#RemoveThamanFromSSMB28 pic.twitter.com/TYFTifVUKe
— ★ (@_hurl_) February 4, 2023
Pothav ra reyy #RemoveThamanFromSSMB28 pic.twitter.com/895tTHYjKW
— Harami 😜 (@4005SMB) February 4, 2023