సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చాలా చిత్రాలు ఉన్నాయి.. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఒకటి. 2005 ఈ సినిమా విడుదలవ్వగా.. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ దర్శకులు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో పాటు నయనతార, ప్రభు, జ్యోతిక కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. కామెడీ, హార్రర్ కాంబినేషన్లో రూపొంచిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతోగానో ఆకట్టుకుంది. ఎన్నో రోజులుగా సినీ ప్రియులను ఊరిస్తున్న చంద్రముఖి-2 మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
17 ఏండ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై చంద్రముఖి 2 మళ్లీ భయపెట్టేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చంద్రముఖి 2 అధికారిక అప్డేట్ ను లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఫస్ట్ పార్టును డైరెక్ట్ చేసిన పి వాసు చంద్రముఖి 2కు దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ..టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ బంగ్లాలో బంగారు వర్ణంలో కొద్దిగా తెరిచి ఉంచిన పెద్ద తలుపులు పోస్టర్ బ్యాక్ డ్రాప్లో కనిపిస్తున్నాయి. ఇక చంద్రముఖి చిత్రంలో సూపర్ స్టార్ హీరోగా నటిస్తే.. చంద్రముఖి 2 లో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవా లారెన్స్ సీక్వెల్ లో హీరోగా నటించబోతున్నాడు. ‘కాంచన’ మూవీ సిరీస్‌లతో హారర్, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ ‘చంద్రముఖి 2’లో మేయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు.
తన కామెడీ టైమింగ్‌తో చంద్రముఖిలో అలరించిన వడివేలు.. పార్ట్-2లో మరోసారి అభిమానులను నవ్వించనున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్‌గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్‌ను చూసుకోనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. చంద్రముఖికి సీక్వెల్‌గా లారెన్స్ హీరోగా తెరకెక్కుతోన్న చంద్రముఖి 2 అదే స్థాయిలో సంచలనం రేపుతుందా లేదా అనేది చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨
Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎
Directed by #PVasu 🎬
Music by @mmkeeravaani 🎶
Cinematography by @RDRajasekar 🎥
Art by #ThottaTharani 🎨
PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH— Lyca Productions (@LycaProductions) June 14, 2022