ఆహాలో ప్రసారమవుతున్న పాపులర్ సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' షో తుదిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఐదుగురు కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరనే సస్పెన్స్ కు బ్రేక్ పడింది. నెల్లూరుకు చెందిన వాగ్దేవి.. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచింది. ఈ శుక్రవారం ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలేకి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విరాటపర్వం మూవీ జంట రానా, సాయిపల్లవి స్పెషల్ గెస్టులుగా దర్శనమిచ్చారు. ఇక ఈ షోకి సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ కాగా తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ నుండి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ.. చివరికి ఐదుగురు ఫినాలే చేరుకున్నారు. వీరిలో స్ట్రాంగ్ ఫినాలే పెర్ఫార్మన్స్ తో వాగ్దేవి టైటిల్ నెగ్గింది. మెగాస్టార్ చేతుల మీదుగా కూతురు ట్రోఫీ అందుకోవడాన్ని చూసిన వాగ్దేవి తండ్రి.. 'చిరంజీవి గారికి, నెల్లూరుకు మంచి అనుబంధం ఉందని.. ఆయన చేతుల మీదుగా నా కూతురు ట్రోఫీ అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ.. "ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి నన్ను ఎంతోమంది ప్రోత్సహించారు. ఒక సింగర్ గా నాకు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని ఉంది. అలాగే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి దగ్గర కోరస్ టీమ్ లో పాడినా అదృష్టంగా భావిస్తాను. నన్ను సింగర్ గా చూడాలనేది మా అమ్మ కోరిక. ఈ ట్రోఫీని మా అమ్మకు అంకితం ఇస్తున్నాను. నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రేక్షకులకు నేను దగ్గరైనందుకు అదృష్టంగా భావిస్తాను. చదువు పూర్తిచేసి, సింగర్ గా నిలదొక్కుకోవాలనేది నా కోరిక" అని చెప్పింది. మరి తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Talented Top 5 singers, Vaarilo first #TeluguIndianIdol trophy Evaru geluchukuntaaru? #MegaFinale with #Megastar Premieres June 17@KChiruTweets @MusicThaman @MenenNithya @singer_karthik @Sreeram_singer @fremantle_india pic.twitter.com/AUbWFplHHo — ahavideoin (@ahavideoIN) June 14, 2022 Who is going to be the FIRST EVER #TeluguIndianIdol Title winner? Gear up for MEGA FINALE with #Megastar & the #VirataParvam power couple#TeluguIndianIdol #MegaFinale Episode Premiers on June 17th pic.twitter.com/YpQX7APxXE — ahavideoin (@ahavideoIN) June 11, 2022