సున్నితమైన భావోద్వేగాలను కథా వస్తువుగా మార్చుకుని, అద్భుతమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో అందరికన్నా ముందుగా వినిపించే పేరు శేఖర్ కమ్ముల. కమ్ముల ఇప్పుడు తనదైన పంధాలో తెరకెక్కించిన చిత్రం “లవ్ స్టోరీ”. ఇప్పటికే పలుమార్లు విడుదలని పోస్ట్ పోన్ చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
లవ్ స్టోరీ ట్రైలర్ మాత్రం సినిమా పైన అంచనాలను పెంచేసిందని చెప్పుకోవచ్చు. జీవితంలో సెటిల్ కావాలని కలలు కనే ఓ మధ్యతరగతి అబ్బాయి, ఓ మధ్య తరగతి అమ్మాయి. ఈ ప్రాసెస్ లో వారికి ఎన్నో కష్టాలు. ఇలాంటి సమయంలో వారిద్దరూ కలసి జర్నీ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలోనే ఆ జంట ప్రేమలో పడుతుంది. మరి అక్కడ నుండి.. వారు తమ ప్రేమని కాపాడుకోవడానికి ఎలా కష్టపడ్డారు అన్నది లవ్ స్టోరీ కథ.
ట్రైలర్ లో నాగచైతన్య, సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశారు. తెలంగాణ యాసలో వీరు చెప్పిన డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వీరితో పాటు.. రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలలో నటించినట్టు తెలుస్తోంది. మరి.. ఈ నెల 24న విడుదల కాబోతున్న లవ్ స్టోరీ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.