క్రేజీ కాంబినేషన్ ఒకటి రెడీ అవుతోంది. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మూవీ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
సినిమా అనేది నేడు విశ్వవ్యాప్తమైంది.ఒక భాషకు మాత్రమే పరిమితమైన నటులు గాని, టెక్నిషియన్స్ గాని ఇప్పుడు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రపంచ సినిమా మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రపంచ సినిమాలో ఎన్నో భాషలకు సంబంధించిన హీరోల, హీరోయిన్ ల దర్శకుల కాంబినేషన్ లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అలాంటి ఇంకో కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలు ఆ కాంబినేషన్ లో మూవీ వస్థుందనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ ప్రేక్షకుల ఆలోచనలని తలకిందులు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులుని చేయడానికి త్వరలోనే ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతోంది.
ధనుష్.పరిచయం అక్కర్లేని పవర్ ఫుల్ పేరు..తమిళ కుర్రకారుని వెర్రెక్కిపోయేలా చేసే పేరు. సినిమా సినిమాకి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ స్టార్స్ లో ఒకడిగా ధనుష్ వెలుగొందుతున్నాడు. తాజాగా ధనుష్ చెయ్యబోయే సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక మూవీ చేయబోతున్నాడు. ఒక రకంగా ఈ వార్త అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమే. ఎందుకంటే ధనుష్ అంటే మాస్. మాస్ అంటే ధనుష్. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలైతే పూర్తి క్లాస్ తో కూడి ఉంటాయి. మరి ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో వస్తున్న మూవీ ఖచ్చితంగా అంచనాలని పెంచే చిత్రమే అని చెప్పవచ్చు
ఇంక ఈ మూవీ లో ధనుష్ కి జోడిగా నేటి యూత్ కలల రాణి రష్మిక మందన్నా జతకట్టబోతుంది. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. తాజాగా హిందీలో రణబీర్ కపూర్ లాంటి బిగ్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేస్తుంది. ధనుష్, రష్మిక, శేఖర్ కమ్ముల కాంబినేషన్ ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ .అలాగే పాన్ ఇండియా మూవీ అని కూడా చెప్పవచ్చు. ధనుష్ కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉందనే విషయం విదితమే. ఈ ప్రెస్టీజియస్ మూవీని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండటం విశేషం. అలాగే అమిగోస్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఈ మూవీ లో భాగస్వామ్యం కానుంది.