దర్శకధీరుడు రాజమౌళి.. భారీ బడ్జెట్‌తో.. ఇద్దరు స్టార్ హీరోలు, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కించి చిత్రం RRR మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు అల్లూరు సీతారామారాజు, కొమురం భీం.. ఇద్దరు కలిస్తే చరిత్ర ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. ఇక సినిమాలో రామ్ చరణ్, జూనియర్ యాక్టింగ్‌కి జనాలు ఫిదా అయ్యారు. ఇక సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దగుమ్మ ఆలియా భట్ నటించగా.. జూనియర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటించింది.
ఇది కూడా చదవండి: తెలుగు సినిమాల్లో నటించను.. బాలీవుడ్ హీరో నోటి దురుసు!
అయితే RRRలో సీత పాత్ర కోసం రాజమౌళి ఆలియా భట్ కన్నా ముందు ఇద్దరు బాలీవుడ హీరోయిన్లను సంప్రదించారట. వారిలో ముందుగా శ్రద్ధా కపూర్ దగ్గరకు ఈ ఆఫర్ వెళ్లగా.. బిజీ షెడ్యూల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పేసిందట. తర్వాత పరిణీతి చోప్రాను అడిగారు. ఆమె కూడా తీరిక లేకుండా వరుస సినిమాలతో ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పేశారు. అప్పుడు ఆలియా భట్‌ను సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పారు. ఈ పాత్ర చేయడానికి ఆలియా భట్ తెలుగు నేర్చుకుని మరీ నటించటం విశేషం.
ఇది కూడా చదవండి: RRR సినిమా.. రాజమౌళిపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!
ఇక ఒలివియా మోరిస్ కంటే ముందు జక్కన్న.. ఎమీ జాక్సన్‌ను సంప్రదించారు. ఆమె ప్రెగ్నెన్సీతో ఉండటంతో కుదరలేదు. తర్వాత ఎడ్గార్గ్ జోన్స్‌ను తీసుకున్నారు. ఆమె ముందు ఒప్పుకుంది కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో ఒలివియా మోరిస్ లైన్‌లోకి వచ్చింది. అసలు రాజమౌళి సినిమా అంటేనే ఎవరు నో చెప్పరు. అలాంటిది వీరంతా హీరోయిన్ రోల్‌నే వదులుకున్నారు. ఇక సినిమా భారీ విజయం సాధించడంతో.. ప్రస్తుతం వీరంతా తెగ ఫీలవుతున్నారట. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సింహాద్రి సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: Jr Ntr
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.