సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో సుధీర్ ఒకరు. అక్కడ వచ్చిన ఫేమ్ తో అనేక షోల్లో పాల్గొన్ని మంచి ఫాలోయింగ్ సంపాందించాడు. అందరూ సుధీర్ ని బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. బుల్లితెరపై వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి..వెండితెరపై కూడా మెరిశాడు. పలు సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇక అమ్మాయిల్లో కూడా సుధీర్ కి మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఓ యువతి..సుధీర్ పై ఉన్న తన అభిమానాన్ని తెలియజేసింది. “ఐ లవ్ యూ సుధీర్” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్.. సినిమాల్లో ఫ్రెండ్ కేరెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా చేసే స్థాయికి ఎదిగారు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. తాజాగా సుధీర్ నటించిన చిత్రం “గాలోడు”. సుధీర్ హీరోగా వచ్చిన తొలి సినిమా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్లనే “గాలోడు’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో సుధీర్ సరసన గెహ్నా సిప్పీ హీరోయిన్ నటించింది. ఈ మూవీ నవంబరు 18న రిలీజై.. మంచి టాక్ సొంత చేసుకుంది. సుధీర్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు సుధీర్ నటనకు మంచి మార్కులు వేశారు. ఇందులో సుధీర్ ఫైట్స్ , డ్యాన్స్ అన్ని చాలా బాగున్నాయి అంటూ ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా థియేటర్ల వద్ద సుధీర్ ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటు పెద్ద ఎత్తున కేకలు వేశారు.
ఈక్రమంలో ఇక సినిమా చూసిన అనంతరం ఓ యువతి..సుధీర్ పై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసింది. ఐ లవ్ యూ సుధీర్ అంటూ తన భావాలను సదరు యువతి వ్యక్తం చేసింది. ఇక ఆ యువతి మాట్లాడుతూ..” ఈ సినిమాలో సుధీర్ ను చాలా బాగా చూపించారు. డ్యాన్స్, ఫైట్స్ తో సుధీర్ అదరకొట్టాడు. గత సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీ కంటే ఈ మూవీ చాలా బాగుంది” అని తెలిపింది. ఈక్రమంలో సుధీర్ మీ వద్దకు వస్తే ఏం చెప్తారు? అని మీడియ వాళ్లు అడగ్గా… “ఐ లవ్ యూ సుధీర్” అని తన ప్రేమను వ్యక్తం చేసింది. సుధీర్ దగ్గరకి వస్తే హగ్ ఇస్తాను అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.