హీరో నాగశౌర్య చూడగానే పక్కింటి కుర్రాడిలా.. లవర్ బాయ్‌లా కనిపిస్తాడు. తను ఎంచుకునే రోల్స్ కూడా అలానే ఉంటాయి. ఛలో చిత్రం నాగశౌర్య కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇలా సాఫీగా సాగుతున్న కెరీర్లో లక్ష్య సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య.. ఎంతో కష్టపడి 8 ప్యాక్ బాడీ ట్రై చేశాడు. కానీ ఆ సినిమా, ప్రయత్నం రెండు వృథా అయ్యాయి. ఆ తర్వాత నాగశౌర్య తన పంథా మార్చాడు. తనకు గుర్తింపు తెచ్చిన లవర్ బాయ్ రోల్స్‌కి షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా కృష్ణ వ్రింద విహారి సినిమా తెరకెక్కుతుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, చిత్ర టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా నిర్మాత, నాగశౌర్య తల్లి.. సినిమాకు సంబంధించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వివరాలు..
ఈ సందర్భంగా ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ మొదట మా అబ్బాయి విన్నాడు. చాలా బాగా నచ్చటంతో వెంటనే పాండమిక్ సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దీనిలో నాగశౌర్య పలు రకాల భిన్న కోణాల్లో కనిపిస్తాడు. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ల కొరత వుంది. షిర్లీ సెటియా నటన చూసిన తర్వాత.. ఆ కొరత తీరుతుందని అనిపించింది. తాను చాలా బాగా చేసింది.. మంచి నటి’’ అంటూ ప్రశంసించింది. ఇక ఈ సినిమాలో కథానాయకి పేరు పేరు వ్రిందా.. హీరో పేరు కృష్ణ.. అందుకే సినిమాకు కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టామని చెపుకొచ్చింది.
ఇక ‘‘షూటింగ్ సమయంలో, రిలీజ్ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము. మేమే బలి పశువులం అయ్యాం. అన్ని కష్టాలు బయటకు చెప్పలేం. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదాం అనిపించింది. కానీ కొందరు మిత్రులు.. మీరు చాలా మంచి సినిమా తీస్తున్నారు. మీ మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అని మాకు ధైర్యం చెప్పారు. ఫైనల్ ఔట్పుట్ చూసుకుంటే.. మాకు చాలా తృప్తిగా అనిపించింది. మేం పడ్డ కష్టాలు అన్ని మర్చిపోయాం’’ అంటూ ఉషా ముల్పూరి భావోద్వేగానికి గురయ్యారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.