తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ సత్య టాలీవుడ్ ఇంటర్వ్యూల మీద స్పూఫ్ వీడియోతో మన ముందుకు వచ్చారు. రంగబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నాగశౌర్య నటించిన రంగబలి సినిమా జూలై 7న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. వినూత్నంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సినిమా విడుదలకు ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. కమెడియన్ సత్య, నాగశౌర్యలతో కలిసి కొత్తగా పేరడీ ఇంటర్వ్యూ చేయించింది. పేరడీ కంటెంట్ కి ఎప్పుడూ ఆదరణ అనేది ఉంటుంది. బోర్ కొట్టని కంటెంట్ ఏదైనా ఉందంటే అది పేరడీనే. ప్రముఖులను ఇమిటేట్ చేస్తుంటే పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ఇక కమెడియన్ సత్య కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రముఖ తెలుగు మీడియా జర్నలిస్టులను ఇమిటేట్ చేశారు.
రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే రచ్చ మొదలైంది. కమెడియన్ సత్య చాలా బాగా ఇమిటేట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ స్పూఫ్ ఇంటర్వ్యూ చూసిన కొందరు మాత్రం ఇంటర్వ్యూని విడుదల చేయకూడదంటూ అడ్దకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇంటర్వ్యూ ఫుల్ వీడియో రాదని అనుకున్నారు. కానీ మేకర్స్ ఇంటర్వ్యూ పార్ట్ 1ని విడుదల చేశారు. ప్రోమోతో శాంపిల్ చూపించిన సత్య.. పార్ట్ 1 ఇంటర్వ్యూతో బీభత్సం చేసి పడేశారు. ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ అంటూ ఇద్దరు జర్నలిస్టులను ఇమిటేట్ చేశారు సత్య.
జర్నలిస్టులు ఎలా అయితే హీరోలను ప్రశ్నలు అడుగుతారో.. అలా వాళ్ళని మక్కీకి మక్కీ దించేశారు సత్య. తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతూ నాగశౌర్యని సరదాగా ఆటపట్టించారు. పార్ట్ 1తో కడుపుబ్బా నవ్వుకునేలా చేసిన సత్య పార్ట్ 2 కూడా ఉందని అన్నారు. అయితే ఇది కేవలం వినోదం కోసం మాత్రమే చేసిన వీడియో అని.. జర్నలిస్టులంటే గౌరవం ఉందని డిస్క్లైమర్ కూడా వేశారు. మొత్తానికి నెటిజన్స్ మాత్రం ఈ ఇంటర్వ్యూని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్లు చేసి ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం కూడా ఇంతలా వెయిట్ చేయలేదు, వచ్చేసిందిరా బుల్లోడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యూలో సత్య యాక్టింగ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.