ఈరోజుల్లో ఓ సినిమా 100 రోజుల పోస్టర్ చూడడం అనేది దాదాపు అసాధ్యం. అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు 150, 175, 200 అలాగే కొన్ని చిత్రాలు సంవత్సరాల పాటు ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలు ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే రోజులు పోయాయి.
రీసెంట్‌గా ‘రంగబలి’ సక్సెస్ మీట్‌లో నాగ శౌర్యని ఈ విషయం గురించి ప్రశ్నించారు మీడియా వారు. అలాగే అసహనానికి గురైన శౌర్య, ఈవెంట్ మధ్యలో వెళ్లిపోవడం గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ సత్య టాలీవుడ్ ఇంటర్వ్యూల మీద స్పూఫ్ వీడియోతో మన ముందుకు వచ్చారు. రంగబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్లలో సత్య ఒకరు. సత్య కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించారు. ఆయనకు అవకాశాలు ఎక్కువగా వచ్చినా కూడా గుర్తింపు మాత్రం అంతగా రాలేదు. తాజాగా ‘రంగబలి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌లో స్పెర్మ్‌ను రోడ్డు మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దాం అంటూ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమలో అడుగు పెడితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హెయిర్ తో బిజినెస్ చేయడం ప్రారంభించింది. రూ. 1300తో మొదలుపెట్టి ఇవాళ కోట్లలో సంపాదిస్తోంది. ఈమె తెలుగులో నాగశౌర్యతో ఒక సినిమాలో కూడా నటించిందండోయ్. ఆమె ఎవరంటే?
సాధారణంగా ఎవరైనా హీరోయిన్స్ మొదటి సినిమాకే గ్లామర్ షో చేస్తే.. వారిని చాలా బోల్డ్ అని డిసైడ్ చేస్తుంటాం. కానీ.. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఎలాంటి గ్లామర్ షోకి అవకాశం ఇవ్వరు. ఉదాహరణకు సాయి పల్లవి, నిత్య మీనన్, ప్రియాంక మోహన్ ఈ వరుసలో ఉంటారు. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్నాళ్ల వరకు గ్లామర్ షో చేయకుండా.. సడన్ గా ముద్దు సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించి అందరిని షాక్ కి గురి చేస్తారు.
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన హీరో నాగశౌర్య.. మొత్తానికి ఓ ఇంటి వాడయ్యాడు. ప్రేమించిన నెచ్చెలి అనూష శెట్టి మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం అతిథులకు బ్రహ్మండమైన విందు.. అది కూడా రాజుల కాలం నాటి పద్దతిలో ఏర్పాటు చేసి.. అందరి మనసు గెలుచుకున్నాడు నాగశౌర్య. […]
యంగ్ హీరో నాగశౌర్య వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. బెంగళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశైర్య వివాహం జరిగింది. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో వీరి పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఇదే హోటల్‌లో జరిగాయి. ఆదివారం ఉదయం 11:25 గంటలకు అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడుముళ్లు వేశారు. ఈ వివాహ వేడుక ఔట్-డోర్‌లో జరిగింది. పెళ్లి మండపాన్ని విభిన్న రకాల […]