ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్లలో సత్య ఒకరు. సత్య కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించారు. ఆయనకు అవకాశాలు ఎక్కువగా వచ్చినా కూడా గుర్తింపు మాత్రం అంతగా రాలేదు. తాజాగా ‘రంగబలి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో స్పెర్మ్‌ను రోడ్డు మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దాం అంటూ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్లలో సత్య ఒకరు. సత్య కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించారు. ఆయనకు అవకాశాలు ఎక్కువగా వచ్చినా కూడా గుర్తింపు మాత్రం అంతగా రాలేదు. తాజాగా ‘రంగబలి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో స్పెర్మ్‌ను రోడ్డు మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దాం అంటూ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ క్రమంలో కమెడియన్ సత్య ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం నట్టింట వైరల్ అవుతోంది. కమెడియన్ సత్య ప్రముఖ జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ.. ‘రంగబలి’ హీరో నాగశౌర్యను ఇంటర్వ్యూ చేసిన ప్రోమో విడుదల చేశారు. హీరో నాగ శౌర్య ‘రంగబలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతో పవన్ బాసం శెట్టి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ సినిమా విడుదలకు వారం రోజులు సమయం ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. ఇప్పటికే హీరో నాగశౌర్య మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నాగశౌర్య, కమెడియన్ సత్య ఇద్దరే ఉంటారు. కమెడియన్ సత్య నాగశౌర్యను ఇంటర్వ్యూ చేస్తాడు. పలు షోలు, ప్రెస్ మీట్లతో పాపులారిటీ సంపాదించుకున్న ఐదుగురు జర్నలిస్టులను సత్య ఇమిటేట్ చేస్తాడు. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, గ్రేట్ ఆంధ్ర సీనియర్ జర్నలిస్ట్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ జాఫర్, ‘సంతోషం’ సురేష్ కొండేటి, టీవీ9 న్యూస్ ప్రజెంటర్ దేవీ నాగవల్లి ఈ ఐదుగురిని సత్య ఇమిటేట్ చేశాడు. ‘ఓపెన్ హార్ట్ విత్ సత్య’, ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దేవీప్రియ’, ‘ఇంట్లు మీ డ్రాఫర్’, ‘ప్రెస్ మీట్ విత్ నరేష్ మండేటి’, ‘ ఎక్క్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ వల్లి’.. ఇలా ఐదు భాగాలుగా చేశారు.
సత్య అచ్చంగా వారిని దించేశాడు. చాలా అద్భుతంగా ఇమిటేట్ చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చివర్లో దేవీ నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ.. ‘గెటౌట్ ఫ్రమ్ మై స్టూడియో’ అంటూ అరిచిన విజువల్ హైలెట్ అయ్యింది. ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ‘రంగబలి’ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య, హీరోయిన్ గా యుక్తి తరేజ నటించారు. ఈ చిత్రానికి దివాకర్ మణి కెమెరామెన్ గా.. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 7న తెరకెక్కనుంది.