ఈరోజుల్లో ఓ సినిమా 100 రోజుల పోస్టర్ చూడడం అనేది దాదాపు అసాధ్యం. అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు 150, 175, 200 అలాగే కొన్ని చిత్రాలు సంవత్సరాల పాటు ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలు ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే రోజులు పోయాయి.
ఈరోజుల్లో ఓ సినిమా 100 రోజుల పోస్టర్ చూడడం అనేది దాదాపు అసాధ్యం. అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు 150, 175, 200 అలాగే కొన్ని చిత్రాలు సంవత్సరాల పాటు ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలు ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే రోజులు పోయాయి. అప్పటికి ఇప్పుటి పరిస్థితులు పూర్తిగా వేరు. ఒక చిత్రం నిర్మాణంలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసేసుకుంటున్నారు మేకర్స్. 4 లేదా 6 నుంచి 8 వారాల తర్వాత విడుదల చేసేలా డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు రెండు, మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తవకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో యంగ్ హీరో మూవీ నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
యంగ్ హీరో నాగ శౌర్య, యుక్తి తరేజా జంటగా.. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మించిన కామెడీ, లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ సత్య కామెడీ కేక అని.. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎక్కువైపోయిందని రకరకాల కామెంట్స్ వినిపించాయి. రిలీజ్‌కి ముందు ప్రమోషన్లలో సత్య కొందరు మీడియా వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ ఇంటర్వూలు ప్లాన్ చేయడం కారణంగా కొందరు ఇబ్బంది పడ్డారనే వార్తలు వచ్చాయి.
అలాగే ‘రంగబలి’ సక్సెస్ మీట్‌లో నాగ శౌర్యని ఈ విషయం గురించి ప్రశ్నించారు మీడియా వారు. అలాగే అసహనానికి గురైన శౌర్య, ఈవెంట్ మధ్యలో వెళ్లిపోవడం వంటివన్నీ ప్రమోషన్‌కి బాగానే ఉపయోగపడ్డాయి. పాజిటివ్ టాక్ వచ్చినా కానీ తర్వాత థియేటర్లలో కనిపించలేదు. కట్ చేస్తే ఈ మూవీ నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాలకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రాబోతోంది.
ఇది కూడా చదవండి : స్టీరింగ్ పట్టుకున్న ఈ బాబుని గుర్తు పట్టారా? సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో