రీసెంట్గా ‘రంగబలి’ సక్సెస్ మీట్లో నాగ శౌర్యని ఈ విషయం గురించి ప్రశ్నించారు మీడియా వారు. అలాగే అసహనానికి గురైన శౌర్య, ఈవెంట్ మధ్యలో వెళ్లిపోవడం గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
యంగ్ హీరో నాగ శౌర్య, యుక్తి తరేజా జంటగా.. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మించిన కామెడీ, లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘రంగబలి’. సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నటించిన ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ సత్య కామెడీ కేక అని.. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎక్కువైపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. రిలీజ్‌కి ముందు ప్రమోషన్లలో సత్య కొందరు మీడియా వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ ఇంటర్వూలు ప్లాన్ చేయడం కారణంగా కొందరు ఇబ్బంది పడ్డారనే వార్తలు వచ్చాయి. రీసెంట్గా ‘రంగబలి’ సక్సెస్ మీట్లో నాగ శౌర్యని ఈ విషయం గురించి ప్రశ్నించారు మీడియా వారు. అలాగే అసహనానికి గురైన శౌర్య, ఈవెంట్ మధ్యలో వెళ్లిపోవడం గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
మీడియా పర్సన్స్‌ని కావాలని ఇబ్బంది పెట్టలేదని.. అది అనుకోకుండా జరిగిందని, ఎవరైనా హర్ట్ అయ్యింటే క్షమాపణలు చెప్తున్నాను అంటూ వివాదాన్ని ఇక్కడితో ఆపే ప్రయత్నం చేశారు. ఎవరినైతే ఇమిటేట్ చేశామో వారితో మాట్లాడామని.. వారంతా ఎంజాయ్ చేశారు కానీ హర్ట్ అవలేదని చెప్పారని అన్నాడు శౌర్య. దర్శకుడు పవన్ కూడా మీడియా వారికి క్షమాపణలు చెప్పాడు. ఇక అడల్ట్ కంటెంట్, పిచ్చి పిచ్చి కామెడీ కావాలంటే మా దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. జనాలకు మంచి చెప్పాలనే కానీ చెడగొట్టడానికి సినిమాలు చెయ్యట్లేదని చెప్పుకొచ్చాడు నాగ శౌర్య.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలతో హీరో, డైరెక్టర్ హర్ట్ అయ్యారు. నిజానికి అడిగేటప్పుడు అతను తడబడ్డాడు. ఒక రకంగా వాళ్లకి కూడా అతని ప్రశ్నలు అర్థం కాలేదు సరికదా కాస్త అసహనానికి గురయ్యేలా చేశాయి. ఒక రకంగా జర్నలిస్ట్ కథ గురించి అడిగిన ప్రశ్నల కారణంగా.. డైరెక్టర్, జర్నలిస్ట్ మధ్య వాదన జరిగింది. మధ్యలో మైక్ తీసుకుని తన సైడ్ నుండి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్, ఆ పాత్ర ఆలోచనా విధానం వంటి వాటి గురించి వివరంగా చెప్పిన శౌర్య.. జర్నలిస్ట్ అడిగినంత డీటేల్డ్‌గా ఉండాలంటే.. మా సినిమా 16, 20 గంటలు ఉంటుందని.. ఇక ‘బాహుబలి’ అయితే కొన్ని సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అర్థం చేసుకుని వదిలెయ్యాలి’ అని కోపంతో తన రెండు చేతులను చప్పట్ల మాదిరిగా కొట్టుకుని లేచి వెళ్లిపోయాడు.