ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. అయితే దక్షిణాదితో పోలిస్తే.. బాలీవుడ్లో ఇది కాస్త ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో వచ్చిన స్టార్ మీరో చిత్రాలన్ని బాయ్‌కాట్ బారిన పడ్డవే. తాజాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన విజయ్ దేవరకొండ సినిమా కూడా బాయ్‌కాట్ బెదిరింపులు ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా సహ నిర్మాత అయిన కరణ్ జోహార్‌పై బాలీవుడ్ ప్రేక్షకులకున్న ఆగ్రహం. ఆ ఎఫెక్ట్ రౌడీ హీరో సినిమా మీద బాగానే పడింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్లో అయితే ఇప్పటి వరకు ఈ ట్రెండ్ స్టార్ట్ కాలేదు. ఏ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు బాయ్‌కాట్ చేయమని పిలుపునివ్వలేదు. కానీ అనూహ్యంగా ప్రభాస్‌తో సినిమా చేయబోయే ఓ దర్శకుడిని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఈ బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇంతకు ఎవరా దర్శకుడు.. ఎందుకు బాయ్‌కాట్ చేయమని డిమాండ్ చేస్తున్నారో తెలియాలంటే.. ప్రసుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు.. ఆయన దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా నేడు లాంచ్ అవుతుండటంతో ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతితో సినిమా వద్దుంటూ.. అసలు ఆయనను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్లో #BoycottMaruthiFromTFI అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. అయితే మారుతి మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతలా కోపంగా ఉండటానికి కారణం ఉంది. మారుతి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఈ రోజుల్లో. బూతు కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ కూడా అదే కోవకు చెందిన చిత్రం. ఈ రెండు సినిమాలు హిట్ అయినా కూడా మారుతిపై మంచి అభిప్రాయం కలగలేదు. ఆయన కేవలం అడల్ట్ కంటెంట్ సినిమాలు మాత్రమే తీస్తాడనే అభిప్రాయం నెలకొంది. దాన్నుంచి బయటపడటం కోసం మారుతి.. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో కొత్త జంట, భలే భలే మగాడివోయ్ సినిమాలు తెరకెక్కించి.. సక్సెస్ బాట పట్టారు. ఆ రెండు సినిమాల తర్వాత శర్వానంద్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా రెండు సినిమాలు తెరకెక్కించాడు అయితే అవి యాజరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఇక తాజాగా విడుదలైన పక్కా కమర్షియల్ సినిమా ఏకంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అది కమర్షియల్‌గా హిట్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం మొదలైంది. ఇలా వరుస ఫ్లాపులతో ఉన్న మారుతితో ఇప్పుడీ సినిమా అవసరమా.. అంటూ వరుస ట్వీట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. పైగా ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది అని భయపడుతోన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే కొందరు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. రన్ రాజా రన్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన సుజిత్ తన రెండో సినిమా సాహోని ప్రభాస్‌తో తీశాడు. అది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత ప్రయాణం, సాహసం చిత్రాలకు మాటలే రాసిన రాధాకృష్ణకుమార్ జిల్ మూవీతో దర్శకుడిగా మారాడు. ఆయన సెకండ్ మూవీ రాధేశ్యామ్ ప్రభాస్‌తో తీయగా అది కూడా ఫ్లాప్ అయింది. ఇలా తన కెరీర్లో వరుసగా రెండు ఫ్లాపులు అందుకోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ తాజాగా ప్రారంభం కాబోయే మారుతి సినిమా వద్దంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మరి ప్రభాస్-మారుతి మూవీ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి. Tag is going #BoycottMaruthiFromTFI And #Prabhas is trending national wide now pic.twitter.com/ZKUECuZs9m — A★ (@masscrime_mb) August 24, 2022 Fans situation right now #BoycottMaruthiFromTFI pic.twitter.com/O766VvA2Mb — SALAAR (@bhanurockz45) August 24, 2022 Our cofan @ThePavanVarma18 beating himself because of your project @DirectorMaruthi #BoycottMaruthiFromTFIpic.twitter.com/pL9jgLIiLo — The Punisher (@PuneethRebel9) August 24, 2022 I’m supporting this trend Ah maruti vaddu ra babu Smash that rt button Rebels #BoycottMaruthiFromTFI pic.twitter.com/kmFKG3nLHD — NANI || DHFPB || 3 (@nanidhfpb3) August 24, 2022 For the first time in the HISTORY of the Indian Cinema prabhas fans Boycotting their own movie & the director vere level hype #BoycottMaruthiFromTFI — UDAY (@UDAyVarma1882) August 24, 2022 ఇది కూడా చదవండి: ‘బాహుబలి’ ఇంగ్లీష్ డబ్బింగ్‌పై నెటిజన్స్ ఫైర్! కార్టూన్ సినిమా చేసారేంట్రా..? ఇది కూడా చదవండి: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ K’..? పాన్ వరల్డ్ మూవీపై ఆసక్తికర వార్త!