కిరాక్ ఆర్పీ.. ఈ పేరుతో బుల్లితెర ప్రేక్షకులకు చాలా పెద్ద అనుబంధమే ఉంది. జబర్దస్త్ షోతో కమీడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వెండితెరపై కూడా చాలా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో కొనసాగుతున్నాడు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో సెలబ్రిటీలు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించడం చూస్తున్నాం. అలాగే కిరాక్ ఆర్పీ కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో తన హోమ్ టూర్ చేశాడు. చూడగానే మతిపోయే రేంజ్ లో ఉంది కిరాక్ ఆర్పీ హోమ్. ఆ హోమ్ టూర్ లో ఆర్పీ మరో ఆసక్తికర అంశాన్ని రివీల్ చేశాడు.
ఇదీ చదవండి: Jr.NTR ని అవమానిస్తూ పవన్ హీరోయిన్ ట్వీట్! ఫ్యాన్స్ ఫైర్!
ఆ విషయం ఏంటంటే.. కిరాక్ ఆర్పీ ప్రేమలో పడ్డాడు. తన బెడ్ రూమ్ చూపిస్తూ మంచం మీదున్న ఓ రెడ్ హార్ట్ పిల్లోని గట్టిగా పట్టుకుని మెలికలు తిరిగిపోతూ ఆ విషయాన్ని తెలిపాడు. తాను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు ఆమె ఫొటో చూపిస్తూ పరిచయం చేశాడు. ఇంకో విషయం ఏంటంటే.. ఇద్దరి పేరెంట్స్ ఒప్పుకున్నారని చెప్పాడు. ఇంక మే నెలలో తన ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. తాను ప్రేమలో పడిన వెంటనే.. మెగా బ్రదర్ నాగబాబు వద్దకు తీసుకెళ్లి ఆమెను పరిచయం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంకే ముంది కిరాక్ ఆర్పీ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు.