నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. ఇక ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడంతో కొత్తకొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తూ.. తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు ఆర్పీ.
‘తెలివి ఉంటే మంచిగా బతుకుతావురా బిడ్డా’ అన్నది పెద్దవారి మాట. ఇప్పుడు అదే తెలివితో రెండు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతున్నాడు జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ. ప్రముఖ కామెడి షో అయిన జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్పీ. ఇక తనలో మంచి నటుడే కాకుండా అంతకు మించిన వ్యాపార వేత్త కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. జబర్దస్త్ మానేసిన అనంతరం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే బిజినెస్ ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. దాంతో మణికొండలో కూడా తాజాగా ఓ బ్రాంచిని ఓపెన్ చేశాడు ఆర్పీ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను సుమన్ టీవీతో పంచుకున్నాడు ఆర్పీ.
కిర్రాక్ ఆర్పీ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న పేరు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఫుడ్ బిజినెస్ ను ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఇది జనాదరణ పొంది బ్రాంచ్ లు పెట్టే స్థాయికి ఎదిగింది. ఇక జనాల తాకిడికి తట్టుకోలేక కొన్ని రోజులు ఈ బిజినెస్ ను మూశాడు కూడా ఆర్పీ. తర్వాత మళ్లీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ప్రారంభించాడు. బిజినెస్ సక్సెస్ అవ్వడంతో.. తాజాగా మణికొండలో సైతం బ్రాంచిని ఏర్పాటు చేశాడు ఆర్పీ. ఈ బ్రాంచీ ఓపెనింగ్ సందర్భంగా సుమన్ టీవీతో ముచ్చటించాడు ఆర్పీ.
“నాకు ఇంత పేరు రావడానికి ముఖ్య కారణం సుమన్ టీవీనే. అందుకు సుమన్ టీవీకి ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటికైతే చాలా మంచిగా బిజినెస్ జరుగుతోంది. నా బిజినెస్ కు సక్సెస్ కావడానికి చాలా మంది సహకరించారు” అని చెప్పాడు కిర్రాక్ ఆర్పీ. ఇక మీ స్నేహితుడు అదిరే అభి ఓవర్సిస్ లో కూడా మీరు చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా..”కచ్చితంగా అమెరికాలో ఆర్పీ చేపల పులుసు పెడతాను. కొద్దిగా అనుభవం, మ్యాన్ పవర్ పెరిగాక అక్కడి తెలుగు వారికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి చూపిస్తాను. త్వరలోనే అన్ని విషయాలు చెప్తాను” అని చెప్పుకొచ్చాడు ఆర్పీ. మరి అమెరికాలో కూడా ఆర్పీ చేపల పులుసు ప్లాన్ చేస్తున్నా అన్న కిర్రాక్ ఆర్పీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.