గత కొన్ని రోజులకు ముందు, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు కిరాక్ RP నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ‘జబర్దస్త్’ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ.. హైదరాబాద్ లో చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టాడు. దీని గురించి వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ మాట్లాడుకున్నారు. స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు అదిరిపోయే రేంజ్ లో క్లిక్ అయింది. ఆర్పీ తయారు చేయించిన చేపల పులుసు కోసం జనాలు క్యూ కట్టిన వీడియోలు కూడా మనం చాలావరకు చూశాం. ఇప్పుడు ఆర్పీకి అంతగా పేరు తీసుకొచ్చిన ఆ పులుసుపై రాకింగ్ రాకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కిరాక్ ఆర్పీ అనగానే నెల్లూరు యాసలో పలికిన డైలాగ్స్, వాటితో ఉండే స్కిట్సే గుర్తొస్తాయి. ఓ సాధారణ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ‘జబర్దస్త్’ నుంచి బయటకొచ్చి పలు ఛానెల్స్ లో కామెడీ షోలు కూడా చేశాడు. కొన్ని నెలల ముందు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జబర్దస్త్’పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత మొన్నీ మధ్య ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఓ కర్రీ పాయింట్, రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు. జనాలు కూడా బాగానే వచ్చారు. అయితే రీసెంట్ గా ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన చేపల పులుసుపై కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు.
సరే ఇదంతా పక్కనబెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమెడియన్ రాకింగ్ రాకేష్, కిరాక్ ఆర్పీ చేపల పులుసుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అది ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ పెట్టిన బిక్ష అని చెప్పుకొచ్చాడు. ఆర్పీని ఈ మధ్య ఏమైనా కలిశారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘లేదండి అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు. మేం చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కిరాక్ ఆర్పీ చేపల పులుసుపై రాకేష్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.