సినిమా ఇండస్ట్రీ పైకి కనబడడానికి ఇంద్రధనస్సులా రంగుల ప్రపంచంలా ఉంటుంది కానీ కొందరి జీవితాలు చూస్తే డార్క్ కలర్ లోనే ఉంటాయి. ముఖ్యంగా తెరపై నవ్వించే హాస్యనటుల జీవితాలు అయితే తెరవని పుస్తకాల్లో చదవని కథల్లా ఉండిపోతాయి. పైకి సంతోషంగా కనబడుతూ.. నవ్వించడమే థ్యేయంగా జీవిస్తుంటారు. అయితే లోపల వాళ్ళు పడే బాధ, వాళ్ళ అనారోగ్యం ఇవేమీ బయటకు తెలియనివ్వరు. పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు ఏమీ వాళ్ళ జీవితాలని మార్చేయవు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. ఆ డబ్బులు సరిపోవు. అలా అని ఎవరినీ నోరు తెరిచి సాయం అడగలేరు. సాయం అడిగితే చేసేవాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.
కానీ సాయం అవసరం ఉందని గుర్తించి స్వచ్చందంగా ముందుకు వచ్చేవాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో కిరాక్ ఆర్పీ ఒకరు. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నారు. రీసెంట్ గా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న వీడియోని రిలీజ్ చేశారు. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ సమస్య ఉందని తెలిసిన ఆర్పీ.. పంచ్ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. ప్రసాద్ కి నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. ‘ప్రోగ్రాంలు లేవు. పంచ్ ప్రసాద్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతకు ముందులా చలాకీగా లేడని, బయటకు కనిపించేంత ఆనందంగా ప్రసాద్ లేడని.. అందుకే ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించారు.
ప్రసాద్ కి ఒక్క రూపాయి ఆస్తి లేదని, అప్పులు ఉన్నాయని.. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి అయ్యే ఖర్చు ఎంతైనా గానీ తానే భరిస్తానని ప్రసాద్ కి కిరాక్ ఆర్పీ హామీ ఇచ్చారు. అంతేకాదు రూమ్ రెంట్ తో సహా నెలకి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులన్నీ భరిస్తామని అన్నారు. నిజానికి జబర్దస్త్ లో కిరాక్ ఆర్పీ లేరు. వేరే ఎవరైనా అయితే అవసరం లేదు అనుకునేవారేమో. కానీ కిరాక్ ఆర్పీ మాత్రం పాత స్నేహితులను గుర్తుపెట్టుకుని.. సాయం చేయడానికి ముందుకు రావడంపై కిరాక్ ఆర్పీని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. మరి పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పిన కిరాక్ ఆర్పీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.