కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో మంచి గుర్పించు సంపాదించుకున్నాడు. టీమ్ లీడర్ గా కూడా కొన్నాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు రావడం, ఆ షోపై, అక్కడి పరిస్థితులపై ఆర్పీ కామెంట్స్ చేయడం అందరూ చూశారు. ఆర్పీ ఏం చేస్తాడు మరి అని అంతా ఎదురుచూసిన తరుణంలో.. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేయడమే కాదు.. ఇప్పుడు రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాడు. ఆ బ్రాంచ్ ఓపెనింగ్ హైపర్ ఆది రావడం అందరినీ ఆకట్టుకుంటోంది.
కిరాక్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కర్రీ పాయింట్ కి సిటీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ తాకిడి తట్టుకోలేక ఆర్పీ కొన్నిరోజులు బిజినెస్ కూడా ఆపేశాడు. మళ్లీ నెల్లూరు వెళ్లి చేపల పులుసు వండేందుకు ఆడిషన్ నిర్వహించి ఆడవాళ్లను తీసుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా కిరాక్ ఆర్పీ తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ ని సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేశాడు. గురువారం మణికొండలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ కార్యక్రమానికి ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినిమా ప్రముఖులే కాదు.. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమేడియన్లు కూడా వచ్చారు.
వీరిలో హైపర్ ఆది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే కిరాక్ ఆర్పీ జబర్దస్త్ మీద కామెంట్స్ చేసినప్పుడు మొదట రియాక్ట్ అయ్యింది హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్. ఆర్పీ ప్రశ్నలకు మేము సమాధానం చెబుతామంటూ వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆర్పీ చేపల పులుసు ఓపెనింగ్ కి ఆది రావడం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. వారి మధ్య ఎంతైనా కాస్త దూరం వచ్చిందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఇద్దరూ ఇలా కనిపించడంపై వారి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ గొడవలు మర్చిపోయి ఇద్దరూ కలిసిపోవడం సంతోషంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు.