తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్ధస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది కళాకారులు ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్నారు. ఎంతో మంది వెండితెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయం అయి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి అందిరకీ తెలిసిందే. ఇటీవల ఆయన జబర్ధస్త్ కామెడీ షో కి గుడ్ బాయ్ చెప్పి వేరే ఛానల్స్ కి వెళ్లారు. ఆ తర్వాత సొంతంగా బిజినెస్ లోకి అడుగు పెట్టారు.
ఇటీవల కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఓ కర్రీ పాయింట్ ప్రారంభించారు. ఆయనకు ఉన్న ఇమేజ్ తో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ కి ఊహించిన దానికన్నా ఎక్కువ కస్టమర్స్ వచ్చారు. ఈ క్రమంలో అక్కడ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో తాత్కాలికంగా కర్రీపాయింట్‌ను క్లోజ్ చేశాడు ఆర్పీ. ఆ తర్వాత వేరే ప్రాంతంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ని ఓపెన్ చేశాడు. అయితే ఈ మద్య తన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ టేస్ట్ బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని రూమర్లు సృష్టిస్తున్నారని.. అదంతా పెయిడ్ బ్యాచ్ పనే అంటున్నాడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని.. మోసం చేసి ఎన్నాళ్లు బిజినెస్ చేయలేరని.. తాను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని అన్నారు. అంతేకాదు పెయిడ్ బ్యాచ్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు కిరాక్ ఆర్పీ.
నేను ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎంతో మంది కస్టమర్లు రుచి ఎంతో బాగుందని పదిమంది కొత్త కస్టమర్లను వెంటపెట్టుకొని మరీ వస్తున్నారని అన్నారు. ఎలాంటి టెస్ట్ లేకపోతే తన కర్రీ పాయింట్ వద్దకు ఎవరూ రారు అన్నారు. నేను పలు రకాల చేపలు పులుసు పెడుతున్నాను. అందరూ టెస్ట్ చూసి బాగుందని అంటుంటే.. ఒక్కడు బాగాలేదని నెగిటీవ్ కామెంట్ చేయడం అంటే ఆ వ్యక్తి ఎంత ఓర్వలేనివాడో అర్థం అవుతుందని అన్నారు. నేను కరెక్ట్ లేకపోతే నా కిచెన్ లో ఎన్నో వీడియోలు తీశాను.. అవే నా నిజాయితీని నిరూపిస్తాయి అన్నారు. నేను స్వయంగా నా కిచెన్ చూపిస్తూ ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చాను. నేను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా.. నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు. ఎంత నెగిటీవ్ చేస్తే.. నాకు అంత ప్రమోషన్ అంటున్నాడు కిరాక్ ఆర్పీ.