KGF చిత్రం హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్‌ను కూడా ఆమాంతం పెంచేసింది. ఈ సినిమాతో యశ్‌కు పాన్ ఇండియా హీరో గుర్తింపు దక్కితే.. ప్రశాంత్ నీల్ రేంజ్ కూడా అదే విధంగా పెరిగింది. కేజీఎఫ్ చాప్టర్ 1 సాధించిన భారీ విజయంతో.. KGF చాప్టర్ 2పై భారీగా అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒపెన్ అయ్యారు. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: KGF-2 మూవీకి ఊరట.. పెరిగిన టికెట్ రేట్లు, షోలు!
తనకు మద్యం తాగే అలవాటుందన్న విషయాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టారు ప్రశాంత్ నీల్. ‘‘ఓ షరతుతో ఈ విషయాన్ని బయట పెడ్తున్నాను. నా ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని కట్ చేసి పక్కన పడేస్తామని నాకు మాటివ్వండి.. అప్పుడే చెప్తపాను’’ అంటూ ప్రశాంత్ నీల్ చెప్పిన ఆయన వ్యక్తిగత విషయాలు ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాను మద్యం సేవిస్తానని, మందు తాగుతూనే కథలు రాస్తుంటానని అన్నారు ప్రశాంత్ నీల్.
ఇది కూడా చదవండి: బాలీవుడ్ ఎంట్రీపై యష్ క్లారిటీ! సూపర్ పంచ్మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో సన్నివేశాల గురించి ఆలోచిస్తుంటానని.. ఈ సీన్ సినిమాలో అవసరమా లేదా అనేది నిర్ధారిస్తుంటాను అని తెలిపారు. ‘ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్’ అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార్ మూవీ చేస్తుండగా, అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: యష్‌ని ఇంప్రెస్ చేసిన సుమన్ టీవీ యాంకర్.. ‘మీ కోసమే ఈ డైలాగ్’ అంటూ!