సినీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు డెబ్యూ చేయడంతోనే మంచి క్రేజ్ దక్కించుకుంటారు. ముఖ్యంగా కాలేజీ లవ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో కనిపించే హీరోయిన్స్ యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. ఆ విధంగా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సుకృతి అంబటి. ఈ బ్యూటీ గురించి నేరుగా సుకృతి అని పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కావచ్చు. కానీ కేరింత సినిమాలో భావన పాత్రలో నటించిన అమ్మాయి అంటే మాత్రం గుర్తుపట్టే అవకాశం ఉంది.
కేరింత సినిమాలో నూకరాజు పాత్రకు జంటగా భావన పాత్రలో నటించిన సుకృతి.. ఆ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఎందుకో.. కేరింత తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు సుకృతి. ఇంతకాలం కనిపించకుండా పోయిన సుకృతి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. ఆ విధంగానే తాజాగా ఎంగేజ్మెంట్ పిక్స్ పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది.
సుకృతి అంబటి.. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని త్వరలోనే పెళ్లాడనుంది. ఈ క్రమంలో తాజాగా తమ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే.. సుకృతి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అప్పటినుంచి తండ్రే తనకు పెంపకంలో పెరిగిన సుకృతి.. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో చదువుకుంది. రాజస్థాన్లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఇక తండ్రి గురించి.. ‘మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇంత మంచి నాన్న దొరకడం నా అదృష్టం’ అంటూ ఫోటో పెట్టి క్యాప్షన్ జోడించింది. అలాగే కాబోయే భర్త గురించి.. ‘నువ్వే నా సూర్యుడు, చంద్రుడు.. అన్నీ తారలు నువ్వే’ అంటూ తన మనసులోని ప్రేమను బయటపెట్టింది. ప్రస్తుతం సుకృతికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ విష్ చేస్తున్నారు. మరి కేరింత ఫేమ్ భావన అలియాస్ సుకృతి అంబటి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.