ఇప్పటి వరకు ఎంతోమంది కథానాయికలు బాల్యంలో ఎలా ఉండోవారో చూశాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?.. గుర్తు పట్టడం కాస్త కష్టమే. ఇంతకీ తనెవరంటే.. విజయవాడకు చెందిన అచ్చ తెలుగమ్మాయి.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల రేర్ పిక్స్ బాగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్నప్పటి ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. అందులోనూ ముద్దులొలికే హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఇమేజెస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఎంతోమంది కథానాయికలు బాల్యంలో ఎలా ఉండోవారో చూశాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?.. గుర్తు పట్టడం కాస్త కష్టమే. ఇంతకీ తనెవరంటే.. విజయవాడకు చెందిన అచ్చ తెలుగమ్మాయి డింపుల్.అసలు పేరు డింపుల్. కానీ న్యూమరాలజీ ప్రకారం పేరు చివర హయత్ అని పెట్టుకుంది. బెజవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన డింపుల్, 2017లో ‘గల్ఫ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తమన్నా, ప్రభుదేవ నటించిన ‘దేవి 2’ (అభినేత్రి 2) తో కోలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయింది. హిందీలో ధనుష్, సారా అలీ ఖాన్ల ‘అత్రాంగి రే’ లోనూ కనిపించింది. తెలుగులో ‘ఖిలాడి’, ‘రామబాణం’ మూవీస్ చేసింది. ఇక వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ లో స్పెషల్ సాంగ్‌లో రచ్చ రంబోలా చేసింది. డింపుల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్డేట్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. లేటెస్ట్ ఫోటోషూట్స్, వర్కౌట్ పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. డింపుల్ గ్లామరస్ స్టిల్స్ మాత్రమే కాదు.. చిన్నప్పటి పిక్స్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.