తెలుగు సినీ పరిశ్రమలో తన అందంతో నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది నటి సంగీత. కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు నటీ సంగీత. ‘ఖడ్గం’ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత పెళ్ళాం ఊరెళితే, ఆయుధం, సంక్రాంతి, తదితర చిత్రాలతో మంచి ఫేమ్ సంపాదించింది. 2010 తర్వాత దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్‌కు దూరమైన సంగీత మళ్లీ ‘సరిలేరు నికేవ్వరు’ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ.. ఈమే తన పెళ్లి జీవితంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకున్నా తర్వాత కొన్ని రోజులకు పెళ్లి మీద విరక్తి పుట్టిందని, దాని నుంచి బయటకు రావాలని చాలా ప్రయత్నించానని త్వరగ ఈ మ్యరేజ్ లైఫ్‌ని వదిలేయలని అనుకున్నా.
ఎందుకంటే మొదట్లో మా జీవితం అంత దారుణంగా ఉండే అని చెప్పుకోచ్చింది. మేం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. నా భర్త కుటుంబ నుంచి ఒత్తిడి, మా ఇంట్లో గొడవలతో కుటుంబసభ్యులకు దురమైపోయాం. ఆ సమయంలో తొందర పడి పెళ్లి చేసుకున్నామా అని అనిపించింది. తెలిసో తెలియకో ఒక నిర్ణయం తీసుకున్నాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. ఎలాగై ఉన్న సమస్యల నుంచి బయట పడాలని అనుకున్నా అప్పుడు నా ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. ముందు దానిపై దృష్టి పెట్టాం. అప్పుడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాము. ఇద్దరం ఇడస్ట్రీలో ఉన్నప్పటికీ మా ఆలోచనలు, వేరుగా ఉండేవి అప్పుడు తన ఇష్టాలను తెలుసుకొని తనకు అణుగునంగా ఉన్నాను తను కూడా నా గురించి తెలుసుకోని నా ఇష్టలాకు కట్టుపడి ఉన్నాడు.
నా భర్త క్రిష్ మంచి వ్యక్తి నన్ను వదులుకోవడం తనకి అస్సలు ఇష్టం లేదు . నేను తనని చాలా సార్లు వదిలేద్దామని అనుకున్నా కానీ నన్ను మోటివేట్ చేసి నాలో చాలా ధైర్యం నింపాడు. తన భర్తతో పొలిస్తే నేను ఇక రాక్షసి అని నేను ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాలని ఫిక్సవుతాను. తను మాత్రం నా కోసం ఏదైనా చేస్తాడు. అందుకే పెళ్లి జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాను. తను నన్ను చాలా ప్రేమిస్తాడు. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన పెళ్లి జీవితం పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.