1980-90ల్లో తెలుగు తెరకు అనేక మంది హీరోయిన్లు పరిచమయ్యి మెప్పించారు. ప్రస్తుతం ఆ సినిమాలను టివీల్లో వస్తుండగా.. ఇప్పుడు వారిని చూసి ఆ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే ఆలోచన తలుపు తడుతుంది.
1980-90ల్లో తెలుగు తెరకు అనేక మంది హీరోయిన్లు పరిచమయ్యి మెప్పించారు. ప్రస్తుతం ఆ సినిమాలను టివీల్లో వస్తుండగా.. ఇప్పుడు వారిని చూసి ఆ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే ఆలోచన తలుపు తడుతుంది. వారిని వెతికి పట్టుకుని కొన్ని చానల్స్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాయి. కొంత మంది నటీమణుల ఆచూకీ అయితే తెలుస్తుంది కానీ.. మరికొంత మంది గురించి ఎంత వెతికినా తెలియడం లేదు. అయితే వీరు ఎలా ఉన్నారన్న కుతుహలం అయితే ఉంటుంది. అటువంటి వారిలో ఈమె కూడా ఒకరు. బబ్లీ గర్ల్‌గా పేరొందిన ఆమె.. తెలుగులో కృష్ణ, మోహన్ బాబు, సుమన్, రాజేంద్రప్రసాద్, కృష్ణం రాజు, చక్రవర్తి వంటి వారితో నటించింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కన్నింగ్‌తో కూడిన విలనీజాన్ని పండించిన చిత్రం యమధర్మరాజు ఎంఎ. ఈ సినిమాలో ఆయనను నటనను చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఈ సినిమాలో అతడిని ప్రేమించి మోసపోయిన కథానాయికే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్. ఆమె బూర బుగ్గల సుందరి సురభి. చంకోల్ సినిమాతో మలయాళ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పల్నాటి పౌరుషం, మనీ మనీ, అల్లరోడు, బంగారు మొగుడు వంటి చిత్రాల్లో కనిపించింది. కొండపల్లి రత్తయ్య, సింహ గర్జన, కేటు డూప్లికేట్ చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఆ తర్వాత అడపా దడపా కన్నడ చిత్రాల్లో కనిపించి కనుమరుగైంది.
ఆ తర్వాత గుజరాత్ డైరెక్టర్, నటుడు ధర్మేష్ వ్యాస్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. పెళ్లి తర్వాత కూడా ఆమె గుజరాత్ టీవీ సీరియల్స్, నాటకాల్లో నటించింది. ముక్తి బంధన్, పునర్ వివాహ్, సాత్ నిభానా సాతియా, పియా బసంతి రే, ఇష్క్ మెయిన్ మార్జవన్ వంటి సీరియల్స్‌లో మెప్పించింది. గుజరాతీ సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. 2022 లో విడుదలైన హూన్ తారీ హీర్‌లో కనిపించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. భర్తకు సంబంధించిన విషయాలు, సినిమాలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంది. అయితే అప్పుడు ఎంత చబ్బీగా ఉందో.. ఇప్పుడు కూడా అంతే క్యూట్‌గా, బొద్దుగా కనిపిస్తుంది ఈ అమ్మడు.