టాలీవుడ్‌లో అనేక ప్రేమకథా చిత్రాలు వచ్చి అలరించాయి.. అలరిస్తూనే ఉన్నాయి. కొన్ని క్లాసిక్‌గా మిగిలిపోతుంటాయి. ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు. అటువంటి చిత్రాల్లో ఒకటి సంపంగి. సున్నితమైన అంశాన్ని, కుటుంబ కథగా మలచి అద్భుతంగా తెరకెక్కించారు
టాలీవుడ్‌లో అనేక ప్రేమకథా చిత్రాలు వచ్చి అలరించాయి.. అలరిస్తూనే ఉన్నాయి. కొన్ని క్లాసిక్‌గా మిగిలిపోతుంటాయి. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టదు. అటువంటి చిత్రాల్లో ఒకటి సంపంగి. సున్నితమైన అంశాన్ని, కుటుంబ కథగా మలచి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పాటలన్నీ హిట్టే. అప్పట్లో ప్రతి ఒక్కరి నోట వెంట విన్నాఈ పాటలే వినిపించాయి. ఇందులో ‘అందమైన కుందనాల బొమ్మరా’, ‘చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా’, ‘సంపంగి రెమ్మ, పూబంతి వమ్మ..నచ్చావే గుమ్మ’వంటి సాంగ్స్ ఎంతో ఫేమస్ అయ్యాయి. ఇప్పటికీ కూడా వీనుల విందుగా అనిపిస్తాయి.
ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా దీపక్, కాంచి కౌల్ నటించారు. ఇందులో నటనకు కాంచి కౌల్‌కు మంచి మార్కులు పడ్డాయి. సంపంగి సినిమాతోనే ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫ్యామిలీ సర్కస్‌లో జగపతి బాబు మరదలిగా అల్లరి పిల్ల పాత్రలో కనిపించింది. ‘నన్నుకొట్టకురో, తిట్టకురో బావో సుబ్బులు బావో’, శివబాలాజీ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీలో కనిపించింది. ఇందులో ‘నీకు మనసిస్తా’సాంగ్స్ చాలా ఫేమస్. ఆ తర్వాత శివరామరాజులో నటించింది. బాలీవుడ్‌లో ఓ సినిమాలో మెరిసింది. సినిమా నుండి టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. 2005 నుండి బాలీవుడ్ బుల్లితెరపై అనేక సీరియల్స్‌లో నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్ నటుడు, టెలివిజన్ హోస్ట్ షబ్బీర్ అహ్లువాలియాను పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమాల నుండి తప్పుకుంది. నాచ్ బలియే, డ్యాన్సింగ్ క్వీన్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు వారందరికీ సుపరిచితమైన కుంకుమ భాగ్య సీరియల్లో నటించారు. అహ్లులియా కూడా అనేక చిత్రాల్లో కనిపించారు. షూటౌట్ ఎట్ లోఖండ్ వాలాతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం కాంచి కౌల్ ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా గడుపుతున్నారు. అప్పటికీ.. ఇప్పటికీ అలానే ఉంది. టూర్స్, ట్రిప్స్, కుమారులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.