మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా మే 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్రారంభించింది. సినిమా యూనిట్ కూడా ప్రతిరోజు వార్తల్లో నిలిచే విధంగా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి.. అలాగే హీరో మహేష్ బాబు, దర్శకుడు పరశురాం గురించి.. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో సర్కార్ వారి పాట షూటింగ్ సమయంలో తన డ్రెస్ దొంగిలించారు అనే విషయాన్ని కూడా బయట పెట్టింది కీర్తి సురేష్.. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: కీర్తి సురేష్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..!అలాంటి వీడియోస్ అవసరమా?
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కళావతి సాంగ్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు పంచుకుంది. ఆ సాంగ్ లో కీర్తి సురేష్ ధరించడం కోసం ప్రొడక్షన్ టీం ఒక అందమైన డ్రెస్ సిద్ధం చేసి తెచ్చి పెట్టారట. అయితే అడ్రస్ ఎక్కడ పెడుతున్నారనే విషయాన్ని గమనించిన కొంతమంది వ్యక్తులు డ్రెస్ పెట్టిన రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరి దాన్ని దొంగతనం చేశారట.
ఇది కూడా చదవండి: సర్కారు వారి ట్రైలరా మజాకా.. 24 గంటల్లో అన్ని రికార్డులు చెరిపేసిన రిపోర్టర్ మహేష్!
డ్రెస్ వేసుకోవడం కోసం లోపలికి వెళ్ళిన కీర్తి సురేష్ కి ఆ డ్రెస్ దొంగతనం జరిగింది అనే విషయం అర్థం కావడంతో వెంటనే నిర్మాతల దృష్టికి తీసుకు వెళ్ళిందట. డ్రెస్ పోతే పోయింది షూటింగ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో మరో డ్రెస్ సిద్ధం చేయించి షూటింగ్ కానిచ్చారట. బార్సిలోనా లాంటి దేశంలో ఇలా దొంగతనం జరగడంతో కీర్తి సురేష్ కాస్త షాక్ కు గురైందట. ఇక మహేష్ బాబుతో తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ సమయంలో మహేష్ బాబు చాలా జోవియల్‌గా ఉండేవాడని వెల్లడించింది. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఎక్కువ వ్యూస్.. లైక్స్ దక్కించుకున్న రికార్డుని ‘సర్కారు వారి పాట’ సొంతం చేసుకుంది. కీర్తి సురేష్‌కు ఎదురైన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Karate Kalyani: విశ్వక్ సేన్ vs దేవి నాగవల్లి వివాదం.. అనసూయని లాగిన కరాటే కళ్యాణి!