తెలుగు సినిమాల్లో తక్కువ కాలంలో ఎక్కువ పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. ఈ మధ్య టిఫిన్ సెంట్ర్లో తన స్నేహితులతో టిఫిన్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను ఇన్‌స్గాలో పోస్ట్ చేసింది. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి కీర్తి సురేశ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో దసరా మూవీతో ప్రేక్షకులను అలరించింది. సింగరేణి బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో కీర్తి.. సహజంగా నటించి అభిమానుల మనసు దోచుకుంది. నానితో నటించిన దసరా మూవీలో కీర్తి నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. దీని తర్వాత వరుస షూటింగ్‌లతో బిజీగా అయింది ఈ అందాల భామ. తమిళంలో ఆమె నటించిన ‘మామన్నన్’ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో కూడా కీర్తి పాల్గొన్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’ రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో చిరుకు చెల్లెలి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోనే జరిగింది. మెగాస్టార్ సరసన తమన్నా కనిపించబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి తన స్నేహితులతో సరదాగా కలిసి తిరిగారు. తను సినిమాల షూటింగ్ వల్ల ఎంత బిజీగా ఉన్నా తీరిక సమయాల్లో మాత్రం స్నేహితులతో సంతోషంగా గడుపుతుంది. గచ్చిబౌలిలోని ఓ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేసి, ఫ్రెండ్స్‌తో కలిసి తందూరీ టీ తాగి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు కీర్తి సురేశ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించింది. తన స్నేహితులతో కలిసి తిరిగిన ఫొటోలు నట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.