ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఇటీవల ఆమె లిప్ లాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్సే ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిగా దూసుకుపోతున్నారు. గీతాంజలి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఈ హీరోయిన్.. నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఆమె నటించిన మహానటి మూవీతో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఈ నటి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక నటతోనే కాకుండా తన అందంతో కూడా కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంటోంది. ఇదిలా ఉంటే, ఈ అమ్మడు లిప్ లాక్ పై ఇటీవల కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా ఫిల్మ్ నగర్ లో తెగ ప్రచారం జరుగుతోంది.
కీర్తి సురేష్ సినిమాల్లో వచ్చిన మొదట్లోనే బోల్డ్ సీన్స్ లో నటించకూడదని, లిప్ లాక్ వంటి సీన్స్ మొత్తానికే దూరంగా ఉండాలనే నిబంధన పెట్టుకున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇప్పటికీ కూడా కీర్తి సురేష్ అదే నిబంధన మీద ఉన్నారనుకోండి. కాగా, బోల్డ్ సీన్స్ పై కీర్తి సురేష్ మాదిరి నిబంధనలు పెట్టి ఆ తర్వాత ఆఫర్ల కోసం హద్దులు దాటిన హీరోయిన్లు చాలా మంది అని చెప్పక తప్పదు. పాత్ర డిమాండ్ చేసింది కాబట్టే అలా చేయాల్సి వస్తుందంటూ క్లారిటీ ఇస్తూ పక్కకు తప్పుకుంటున్నారు.
అయితే, లిప్ లాక్ సీన్స్ పై ఈ హీరోయిన్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ నేను లిప్ లాక్ ఇవ్వాలనుకుంటే మాత్రం అది నా భర్తకు తప్పా మరెవరికీ ఇవ్వను. ఇదే విషయంపై నా తల్లిదండ్రులకు మాటిచ్చానంటూ ఈ హీరోయిన్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నటి చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. లిప్ కిస్ పై హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.