గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో సినిమా సెలబ్రేషన్స్ చేసుకునే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు సినిమా పెద్ద హిట్ అయ్యిందంటే చిత్రబృందమంతా సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడమో లేదా సినిమాకోసం పనిచేసిన వారందరికీ నిర్మాత గిఫ్ట్ హ్యాంపర్లు పంపడమో జరుగుతుండేది. ఇవన్నీ కాకుండా సినిమా అనుకున్నదానికంటే భారీ విజయం సాధించిందని నిర్మాతలు డైరెక్టర్లకు, టీమ్ కి రెమ్యూనరేషన్స్ కాకుండా బోనస్ లు అందించేవారు. కానీ.. రోజులు మారుతున్నాయి కదా.. రానురాను కృతజ్ఞత చూపడం కూడా చాలా ఖర్చుతో కూడుకుంటున్నాయి.
ఇదివరకు చాలా రోజుల తర్వాత మంచి హిట్ సినిమా ఇచ్చాడని దర్శకుడికి నిర్మాతలు, హీరో గిఫ్టులు ఇవ్వడం చూశాం. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్.. తనకు చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. కమల్ హాసన్ తెరపై కనిపించి దాదాపు ఐదేళ్లకు పైనే అవుతోంది. అదీగాక ఆయన హిట్ కొట్టి కూడా చాలా యేళ్లయింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న కమల్.. ఈ ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.
ఇక తనకు ఇన్నేళ్ల తర్వాత మంచి సినిమాను, పెద్ద హిట్టును అందించినందుకు దర్శకుడు లోకేష్ కి.. ఖరీదైన లెక్సస్(Lexus) కంపెనీ కారును గిఫ్టుగా ఇచ్చాడు. ప్రస్తుతం కమల్, లోకేష్ కి గిఫ్ట్ ఇచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఖైదీ, మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత విక్రమ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు లోకేష్. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ మరియు సూర్య నటించడం విశేషం. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు. మరి లోకేష్ కి కమల్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ పై పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
.@ikamalhaasan gifts a Lexus car to his blockbuster director @Dir_Lokesh . Well deserved 👏👏👏👏 #Vikram pic.twitter.com/otw06MJcz9
— Rajasekar (@sekartweets) June 7, 2022