బింబిసారలో డ్యూయెల్ రోల్ లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించడం విశేషం. మరి బింబిసారతో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా రాబట్టాడో చూద్దాం!
నందమూరి హీరోలలో రెగ్యులర్ సినిమాలు కాకుండా ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరో ఎవరంటే కళ్యాణ్ రామ్ అని చెప్పవచ్చు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. గతేడాది నటించి, నిర్మించి బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో మళ్లీ కంబ్యాక్ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మైత్రి మూవీస్ బ్యానర్ లో ‘అమిగోస్’ సినిమా చేశాడు. రీసెంట్ గా విడుదలైన అమిగోస్.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. బింబిసార లాంటి పెద్ద హిట్ తర్వాత ట్రిపుల్ రోల్స్ లో కనిపించేసరికి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.
అమిగోస్ లో కళ్యాణ్ రామ్ కి ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా.. దర్శకుడు రాజేంద్ర రెడ్డి మూవీ తెరకెక్కించాడు. బింబిసార కలెక్షన్స్ లెక్కలు భారీ స్థాయిలో నమోదు అయ్యేసరికి.. ఈసారి అమిగోస్ పై కూడా మీడియం బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బింబిసారలో డ్యూయెల్ రోల్ లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించడం విశేషం. పైగా ఈ సినిమా డోపెల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ తో తెరపైకి వచ్చింది. మరి మినిమమ్ అంచనాల మధ్య విడుదలైన అమిగోస్ మూవీ.. టాక్ పరంగా పరవాలేదనిపించుకుంది. మరి బింబిసారతో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా రాబట్టాడో చూద్దాం!
ఏపీ, తెలంగాణ: రూ. 2.03 కోట్ల షేర్ (రూ. 3.50 కోట్లు గ్రాస్)
వరల్డ్ వైడ్: రూ. 2.58 కోట్ల షేర్(రూ. 4.65 కోట్ల గ్రాస్)
బింబిసార హిట్ తర్వాత రావడంతో ఈ సినిమాపై మోస్తరు అంచనాలు సెట్ అయ్యాయి. కానీ.. ఫస్ట్ డే ఓపెనింగ్స్ బట్టి చూస్తే.. అమిగోస్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కళ్యాణ్ రామ్ తప్ప సినిమాలో మిగతా ఏవి ప్లస్ కాలేదని అంటున్నారు. ఇదిలా ఉండగా.. అమిగోస్ సినిమాకి వరల్డ్ వైడ్ రూ. 11.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా సెట్ అయ్యింది. సో.. మొదటి రోజు రూ. రూ. 2.58 కోట్లు రాబట్టింది. కాబట్టి.. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా రూ. 9.42 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించాడు. మరి అమిగోస్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#KalyanRam Recent Movies 1st Day Collections
👉#Amigos – 2.03CR******
👉#BimbiSara – 6.30CR
👉#EnthaManchivaadavuraa – 2.20Cr
👉#118Movie – 1.60Cr
👉#NaaNuvve – 0.75Cr
👉#MLA – 2.72Cr
👉#ISM – 3.09Cr— T2BLive.COM (@T2BLive) February 11, 2023